Gangubai Kathiawadi: అందుకే గంగూబాయ్‌లో ప్రియాంక, దీపిక నటించలేదట

హీరోయిన్స్‌ అంటే సినిమాలో నాలుగు పాటలు, కొన్ని సీన్స్‌ మాత్రమే అనే సరిహద్దులు ఇటీవలకాలంలో తొలిగిపోయాయి. కథానాయిక పాత్రలు..అందులోనూ సున్నితమైన అంశాలతో పాటు బయోపిక్స్‌లో నటించేందుకు సై అంటున్నారు.

Published : 02 Mar 2022 01:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: హీరోయిన్స్‌ అంటే సినిమాలో నాలుగు పాటలు, కొన్ని సీన్స్‌ మాత్రమే అనే సరిహద్దులు ఇటీవల కాలంలో తొలగిపోయాయి. కథానాయిక పాత్రలు..అందులోనూ సున్నితమైన అంశాలతో పాటు బయోపిక్స్‌లో నటించేందుకు సై అంటున్నారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ ముందు వరుసలో ఉంటారు. అలాంటీ ఈ భామలే ఇటీవల విడుదలైన ‘గంగూబాయి కాఠియావాడి’లో నటించేందుకు నో చెప్పారట. ఆ కారణాలు ఇవేనా అనే చర్చ ఇప్పుడు బాలీవుడ్‌లో నడుస్తోంది.

దీపికా పదుకొణె

గంగూబాయ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీతో కలిసి దీపికా.. గతంలో ‘రామ్‌లీలా’, ‘పద్మావత్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’ చిత్రాల్లో నటించింది. ఇవన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అలాగే ఆమె నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. పలు కారణాలతో దీపిక తప్పుకోవడంతో చివరికి గంగూబాయ్‌గా ఆలియానే కనిపించింది.

ప్రియాంకా చోప్రా

ఆ తర్వాత ప్రియాంకచోప్రా పేరూ పరిశీలనకు వచ్చింది. దీని గురించి ప్రియంకా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో నాకు ఐడియా లేదు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నా. వ్యక్తిగతంగా బిజీ ఉండటంతో ఎలాంటి హిందీ సినిమాలను అంగీకరించలేదు’’ అంటూ క్లారిటీ ఇచ్చింది.

రాణీముఖర్జీ

సంజయ్‌ లీలా భన్సాలీ సినిమాల్లో హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది నటి రాణీముఖర్జీ. . గంగూబాయ్‌ కథ అనుకున్నప్పుడు  రాణీ చేసినా బాగుంటుందని భావించారట. పరిస్థితులు కుదరక రాణీ కూడా తప్పుకొంది.

గంగూబాయి కాఠియావాడిలో అలియా వేశ్య పాత్రలో నటించి అందరిని మెప్పించింది. కెరీర్‌లో తొలిసారి ఆమె రిస్క్‌తీసుకొని నటించిన ఈ పాత్రకు న్యాయం చేశారని అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల మెప్పు పొందుతోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని