EK VILLAIN RETURNS: విలన్ ఎవరు?
బాలీవుడ్ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్లలో ‘ఏక్ విలన్’కు సినీప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. 8ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఏక్ విలన్ రిటర్న్స్’ ప్రేక్షకుల ముందుకు రానుంది
బాలీవుడ్(Bollywood) నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్లలో ‘ఏక్ విలన్’కు(EkVillain) సినీప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. 8ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ (Box Office) వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఏక్ విలన్ రిటర్న్స్’(EK VILLAIN RETURNS) ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్ అబ్రహం(John Abraham), అర్జున్ కపూర్(Arjun Kapoor) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మోహిత్ సూరి తెరకెక్కించారు. జాన్‌కు జోడీగా దిశా పటానీ(Disha patani) కనిపించనుండగా.. అర్జున్ సరసన తారా సుతారియా(Tara Sutaria) నటించింది. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా ఇటీవల చిత్ర ట్రైలర్ (EK VILLAIN RETURNS Trailer) విడుదల చేశారు. వన్ సైడ్ లవర్‌గా ఉన్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్ కథ ఇది. ఈ ప్రతినాయక ఛాయలున్న పాత్రను జాన్ పోషించారు. అతను చేసే వరుస హత్యలకు.. గతంలో దిశాతో తన ప్రేమకథకు ఉన్న లింకేంటి? అర్జున్‌కు అతనికి మధ్య గొడవేంటి? అసలు వీళ్లిద్దరిలో హీరో ఎవరు? విలన్ ఎవరు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ప్రచార చిత్రంలో కనిపించిన పోరాట ఘట్టాలు, రొమాంటిక్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా