యాక్షన్‌ ప్యాక్‌తో ‘ఓం’ ట్రైలర్‌

ఆదిత్యరాయ్‌ కపూర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ డ్రామా ‘ఓమ్‌’. యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరైన కపిల్‌వర్మ దర్శకుడు. ఇందులో ఆదిత్యరాయ్‌ ఒక సైనికాధికారిగా నటిస్తున్నాడు. తాజాగా సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. అగ్నిప్రమాదంలో కన్న కొడుకుని కోల్పోయిన తల్లి పాత్రతో ట్రైలర్‌ మొదలవుతుంది.

Published : 12 Jun 2022 01:26 IST

దిత్యరాయ్‌ కపూర్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ డ్రామా ‘ఓమ్‌’. యాక్షన్‌ చిత్రాలకు పెట్టింది పేరైన కపిల్‌వర్మ దర్శకుడు. ఇందులో ఆదిత్యరాయ్‌ ఒక సైనికాధికారిగా నటిస్తున్నాడు. తాజాగా సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. అగ్నిప్రమాదంలో కన్న కొడుకుని కోల్పోయిన తల్లి పాత్రతో ట్రైలర్‌ మొదలవుతుంది. హీరో తండ్రి ప్రభుత్వ రహస్య అణ్వాయుధ ప్రాజెక్టులో పని చేస్తుంటారు. ఆయన దేశ రహస్యాల్ని శత్రు దేశానికి చేరవేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటారు. దీన్ని ఛేదించడానికి కథానాయకుడు ఓం బయల్దేరతాడు. తర్వాత ఏం జరిగింది? ట్రైలర్లో చూపించారు.


జులై 15న హిందీ ‘హిట్‌’

తెలుగులో మంచి విజయం సాధించిన మిస్టరీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌: ద ఫస్ట్‌ కేస్‌’. ఈ చిత్రం రాజ్‌కుమార్‌ రావు కథానాయకుడిగా అదే పేరుతో హిందీలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాన్యా మల్హోత్రా కథానాయిక. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్రవర్గాలు శనివారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఇందులో రాజ్‌కుమార్‌ పాత్ర పేరు ‘విక్రమ్‌’గా పేర్కొన్నారు. ఈ మోషన్‌ పిక్చర్‌లో ‘మొదటి మిస్టరీ గుట్టు విప్పుతున్నాం. జులై 15న ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ విక్రమ్‌ థియేటర్లలోకి వస్తున్నాడు’ అని చిత్రబృందం తెలిపింది. భూషణ్‌కుమార్‌, దిల్‌ రాజు, క్రిషన్‌ కుమార్‌, కుల్దీప్‌ రాథోడ్‌లు దీన్ని నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని