అందాల భూమి ... మిస్‌ ఇండియా పోటీలకు హోస్ట్‌

బాలీవుడ్‌ నాయికల్లో కథల ఎంపికలో కొత్త దారిలో వెళ్లే కొద్దిమంది నాయికల్లో భూమి పెడ్నేకర్‌ ఒకరు.

Published : 30 Mar 2023 02:24 IST

బాలీవుడ్‌ నాయికల్లో కథల ఎంపికలో కొత్త దారిలో వెళ్లే కొద్దిమంది నాయికల్లో భూమి పెడ్నేకర్‌ ఒకరు. ‘దమ్‌ లగా కే హైసా’ మొదలు తాజా చిత్రం ‘భీడ్‌(రేణుశర్మ)లో పోషించిన వైవిధ్యమైన పాత్రల వరకూ ఆమె సినిమాల ఎంపిక చాలావరకూ అలాగే సాగుతోంది. సినిమా సినిమాకు తనను తాను ఇంకాస్తగా గొప్పగా మలుచుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందంటూ చాలామంది సినీ ప్రముఖులు అభిప్రాయం. తాజాగా ఆమెకు ఓ గౌరవం దక్కింది. ఈ ఏడాది జరిగే మిస్‌ ఇండియా పోటీలకు హోస్ట్‌గా ఎంపికైంది భూమి. ఈ కార్యక్రమం మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ఏప్రిల్‌ 15న జరగనుంది. ప్రస్తుతం ‘ది లేడి కిల్లర్‌’, ‘భక్షక్‌’ సినిమాల్లో నటిస్తుంది భూమి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు