Deepika Padukone: ఆ దశలోనే నా జీవితం

నటులు ఎన్ని సినిమాలైనా చేయొచ్చు... వ్యక్తిగతంగా వాళ్ల మనసుకు దగ్గరగా అనిపించే పాత్రలు కొన్నే ఉంటాయి. ఆ పాత్రలతో ఉన్న అనుబంధాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ నటులు.

Updated : 06 Aug 2022 02:26 IST

టులు ఎన్ని సినిమాలైనా చేయొచ్చు... వ్యక్తిగతంగా వాళ్ల మనసుకు దగ్గరగా అనిపించే పాత్రలు కొన్నే ఉంటాయి. ఆ పాత్రలతో ఉన్న అనుబంధాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ నటులు. ప్రముఖ కథానాయిక దీపికా పదుకొనె అంతే. ‘పీకు’ సినిమా, అందులో ఆమె చేసిన పాత్రంటే తనకెంతో ఇష్టమట. ‘‘నాకు ఇష్టమైన పాత్ర అనే కాదు, ప్రస్తుత నా జీవిత దశ ‘పీకు’ పాత్రకి దగ్గరగా ఉంటుంది. నేను, నా సోదరి ఇద్దరం ఆ పాత్రకి బాగా కనెక్ట్‌ అవుతుంటాం’’ అని చెప్పుకొచ్చింది. కథానాయికగా పదిహేనేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారామె. ఈ సందర్భంగా తన సినీ, వ్యక్తిగత ప్రయాణంలో ఎదురైన అనుభవాల్ని ఇటీవల గుర్తు చేసుకుంది. ‘‘సహనటులు ఒకరితో ఒకరు పోటీ పడటం కాకుండా.. పరస్పర సహకార ప్రక్రియలా భావించి పనిచేస్తే ఆ నటన చాలా నిజాయతీగా ఉంటుంది. ‘పీకు’ విషయంలో అదే జరిగింద’’ని చెప్పుకొచ్చింది దీపికా పదుకొనె. కెరీర్‌ పరంగా విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ ఒక దశలో మానసిక కుంగుబాటుకి గురైన ఆమె ఆ తర్వాత కోలుకుంది. తాను క్లినికల్‌ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు ధైర్యంగా బయటికి చెప్పడంతోపాటు, మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు నడుం బిగించింది. లివ్‌ లవ్‌ లాఫ్‌ అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి సేవా కార్యక్రమాల్ని చేస్తోంది. ‘‘ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటుతో సతమతమయ్యే  ప్రతి ఒక్కరికీ ఆశను ఇవ్వడం, మీరు ఒంటరి కాదనే ధైర్యాన్ని ఇవ్వడం ముఖ్యం’’ అని చెప్పుకొచ్చారు దీపికా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని