Ranbir Kapoor: దేవ.. దేవ

రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జి తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదల కానుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు భాగాలుగా రూపొందుతోంది.

Published : 09 Aug 2022 03:44 IST

ణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జి తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదల కానుంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగం సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా సోమవారం ఈ సినిమాలోని ‘‘దేవ దేవ..’’ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు ప్రీతమ్‌ స్వరాలు సమకూర్చగా.. హిందీలో అమితాబ్‌ భట్టాచార్య, తెలుగులో చంద్రబోస్‌ సాహిత్యమందించారు. అర్జిత్‌ సింగ్‌, జోనిత గాంధి, శ్రీరామచంద్ర ఆలపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని