janhvi kapoor: మేమంత డబ్బున్నోళ్లం కాదు

‘ఇక్కడ ప్రతిభే కీలకం. అతిలోక సుందరి శ్రీదేవి కూతురనో, స్టార్‌ నిర్మాత బోనీ కపూర్‌ ముద్దుల తనయ కావడంతోనో ఎవరూ ఎర్ర తివాచీ పరచరు’ అంటోంది జాన్వీ కపూర్‌. ఇటీవల ఓ మీడియా సంస్థతో మనసు విప్పి చాలా విషయాలే మాట్లాడింది.

Updated : 26 Oct 2022 08:15 IST

‘ఇక్కడ ప్రతిభే కీలకం. అతిలోక సుందరి శ్రీదేవి కూతురనో, స్టార్‌ నిర్మాత బోనీ కపూర్‌ ముద్దుల తనయ కావడంతోనో ఎవరూ ఎర్ర తివాచీ పరచరు’ అంటోంది జాన్వీ కపూర్‌ (janhvi kapoor). ఇటీవల ఓ మీడియా సంస్థతో మనసు విప్పి చాలా విషయాలే మాట్లాడింది. ‘ఔను.. నాది సినిమా నేపథ్య కుటుంబం కావడంతోనే మొదటి అవకాశం తేలికగానే దక్కింది. నా గురించి మరింత తెలుసుకోవాలనే ఆరాటంతో రెండో అవకాశమూ ఇచ్చి ఉండొచ్చు. ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఇప్పుడు నామీద, నా ప్రతిభ మీద నమ్మకం ఉంటేనే ఎవరైనా ఛాన్స్‌లు ఇస్తున్నారు. స్టార్‌ సంతానం అనే కారణంతో ఏ నిర్మాత నన్ను తన సినిమాలోకి తీసుకోరు. రూ.కోట్లకొద్దీ నష్టాలకు సిద్ధపడరు. ఆ నష్టాలు భరించేంత ధనవంతులం నేనూ కాదు.. మా నాన్నా కాదు’ అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. ప్రస్తుతం తను సర్వైవల్‌ డ్రామా ‘మిలీ’లో (Mili) నటిస్తోంది. ఇది మలయాళ చిత్రం ‘హెలెన్‌’ ఆధారంగా రూపొందుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని