విజయ్ దేవరకొండతో కత్రీనా కైఫ్ రొమాన్స్?
ప్రముఖ బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ తెలుగు హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్ ’ చిత్రంలో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఒక చిత్రం కాగా మరొకటి శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ తెలుగు హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ - పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్ ’ చిత్రంలో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఒక చిత్రం కాగా మరొకటి శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడు. ఇందులో ఒకటి పాన్ ఇండియా చిత్రంగా భారీస్థాయిలో తెరకెక్కనున్న చిత్రంలో కత్రీనా - విజయ్‌తో కలిసి నటించనుందనే వార్తలు వస్తున్నాయి. కత్రీనా తన కెరీర్ తొలినాళ్లలోనే ‘మల్లీశ్వరి’, ‘అల్లరిపిడుగు’ వంటి తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె తమిళంలో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ‘మేరీ క్రిస్మస్’ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తోంది. ఇవి కాకుండా హిందీలో ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేదిలతో కలిసి ‘ఫోన్ బూత్’లో నటిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన