KGF Chapter 2 movie review: రివ్యూ: కేజీయఫ్: ఛాప్టర్2
KGF Chapter 2 movie review: కేజీయఫ్: ఛాప్టర్-2 సినిమా ఎలా ఉందంటే?
చిత్రం: కేజీయఫ్: ఛాప్టర్-2; నటీనటులు: యశ్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్, ఈశ్వరిరావు, అచ్యుత్‌కుమార్, మాళవిక అవినాశ్ తదితరులు; సంగీతం: రవి బస్రూర్; సినిమాటోగ్రఫీ: భువన్ గౌడ; ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి; నిర్మాత: విజయ్ కిరంగదూర్; రచన, దర్శకత్వం: ప్రశాంత్ నీల్; విడుదల: 14-04-2022
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీయఫ్2’(KGF Chapter 2) ఒకటి. కన్నడ సినిమాగా విడుదలైన పాన్ ఇండియా మూవీగా రికార్డులు సృష్టించింది ‘కేజీయఫ్-1’. కథా నేపథ్యం, యశ్ నటన, ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. కథానాయకుడి పాత్రను ఎలివేట్ చేసిన విధానం కట్టిపడేసింది. తొలి భాగానికి, రాఖీభాయ్ పాత్రకూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటే ఆ సినిమా ప్రేక్షకులకు ఎంత చేరువైందో అర్థం చేసుకోవచ్చు. తొలి భాగానికి కొనసాగింపుగా భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘కేజీయఫ్-2’. మరి ఆ అంచనాలను అందుకుందా? గరుడను చంపిన తర్వాత రాఖీభాయ్ కేజీయఫ్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు? (KGF Chapter 2 movie review)అధీర, రమికాసేన్, ఇనాయత్ ఖలీలను ఎలా ఎదుర్కొన్నాడు?ప్రశాంత్ నీల్ ఈ కథను ఎలా ముగించాడు?
కథేంటంటే: ముంబై నుంచి కేజీయఫ్ (నరాచీ) సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన రాఖీభాయ్ (యశ్) పేరుకి గ్యాంగ్‌స్టరే కానీ, అక్కడి లక్షల మంది సామాన్య ప్రజలకి దేవుడిగా మారతాడు. వాళ్లంతా రాఖీ సామ్రాజ్యం కోసం ఓ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తారు. నిర్విరామంగా బంగారం నిక్షేపాల్ని వెలికి తీయడం, దాంతో వ్యాపారం చేయడం ఇదే రాఖీ పని. లక్షల మంది సైన్యం, వందల వాహనాలు, హెలికాఫ్టర్లు, ఓడలు రాఖీ సొంతం. శత్రుదుర్బేధ్యమైన కేజీయఫ్ గురించి సీబీఐ ద్వారా ప్రధానమంత్రి రమికాసేన్ (రవీనాటండన్)కి తెలుస్తుంది. దాంతో ఎలాగైనా రాఖీని అంతం చేయాలని రమికా నిర్ణయిస్తుంది.(KGF Chapter 2 movie review) మరోపక్క కొండల్ని సైతం పిండి చేయగల అధీరా (సంజయ్‌దత్) కేజీయఫ్‌ను తన సొంతం చేసుకునేందుకు తన సైన్యంతో రంగంలోకి దిగుతాడు. ఒక పక్క ప్రభుత్వంతోనూ, మరోపక్క అధీరాతోనూ రాఖీభాయ్ పోరాటం ఎలా సాగిందన్నదే ఈ సినిమా.
ఎలా ఉందంటే: ‘బాహుబలి ది బిగినింగ్’ చూసిన వాళ్లంతా, కన్‌క్లూజన్ కోసం ఎంతగా ఎదురు చూశారో... అంతగా ప్రేక్షకుల్ని ఆత్రుతకి గురిచేసిన చిత్రమిది. కారణం రాఖీభాయ్ పాత్రే. జీరో నుంచి హీరోగా ఎదిగిన రాఖీ పాత్రతో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అయ్యారు. గరుడతో సహా ఎంతోమందిని ఓడించి నరాచీలోకి అడుగుపెట్టిన రాఖీభాయ్ తన సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి ఎలా కాపాడుకున్నాడు?అసలు అతని గతమేంటి?అనే విషయాలు ఛాప్టర్ 2పై ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆ ఆసక్తికి తగ్గట్టుగానే సినిమా ఆరంభమవుతుంది. ఆనంద్ వాసిరాజు తనయుడు విజయేంద్ర వాసిరాజు ఛాప్టర్ 2 (KGF Chapter 2)కథని చెప్పడం మొదలు పెడతాడు. నరాచీలో గరుడని చంపాక మిగిలి ఉన్న శత్రువుల్ని రాఖీ ఎలా భయపెట్టాడు? అక్కడ ప్రజలకి ఎంతగా దగ్గరవుతాడనే అంశాలతో కథ మొదలవుతుంది. తొలి భాగంలో హీరో ఎదిగే క్రమంతో పాటు, ఎలివేషన్స్ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఛాప్టర్- 2లో మాత్రం హీరో ఎలివేషన్స్‌పైనే దృష్టిపెట్టాడు దర్శకుడు. అవి ఏ స్థాయికి వెళ్లాయంటే రాఖీ నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇవ్వడం మొదలుకొని... పార్లమెంట్‌లోకి వెళ్లి ఎంపీని కాల్చేసే వరకు! ఈ సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. దర్శకుడు కేజీయఫ్ ప్రియుల్ని మెప్పించేందుకు ఎంత స్వేచ్ఛని తీసుకోవాలో అంత తీసుకుని సన్నివేశాల్ని మలిచాడు. ప్రతీ సన్నివేశం రిచ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంటుంది.(KGF Chapter 2 movie review) కేజీయఫ్ సామ్రాజ్యాన్ని విజువల్స్‌తో ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులకు మరింత కిక్‌నిస్తుంది.
కేజీయఫ్(KGF Chapter 2) సామ్రాజ్యంతోపాటు రాఖీ శత్రువుల గురించి ప్రేక్షకులకు ఓ అవగాహన ఏర్పడటం... రెండో భాగంలోని కథలో మలుపులు కూడా పెద్దగా లేకపోవడం సినిమాకి కాస్త మైనస్. అధీరా ఎలా తిరిగొచ్చాడు?ఇంత కాలం ఏమయ్యాడనే అంశాలను మాటలతో చెప్పుకొంటూ వెళ్లిపోయారు. కేజీయఫ్ కోసం చచ్చినవాళ్లు మళ్లీ బతికొస్తారనే ఓ చిన్న డైలాగ్‌తో ఆ పాత్రకి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, రాఖీ వర్సెస్ అధీరా మధ్య యుద్ధం పెద్దగా ఆకట్టుకోదు. రాఖీ గతాన్ని, తల్లి సెంటిమెంట్‌ని చిన్న చిన్న ముక్కలుగా చూపించారు. నాయకానాయికల మధ్య ప్రేమ చిగురించే తీరు మనసుల్ని హత్తుకునేలా ఉంటుంది. రమికా సేన్కీ, రాఖీకీ మధ్య సన్నివేశాలు సంఘర్షణ బాగుంది. పతాక సన్నివేశాలు కేజీయఫ్ ప్రియులకి మరింత ఉత్సాహాన్నిచ్చేలా ఉంటాయి. (KGF Chapter 2 movie review) నిర్మాణ విలువలు సినిమాని మరోస్థాయికి తీసుకెళతాయి.
ఎవరెలా చేశారంటే: రాఖీ భాయ్‌గా యశ్ (yash) మరోసారి అలరించాడు. హీరోయిక్‌గా కనిపించడంతో పాటు, యాక్షన్ ఘట్టాల్లోనూ అలరించాడు. కొన్నిచోట్ల భావోద్వేగాల్ని పలికించిన తీరు కూడా మెప్పిస్తుంది. కథానాయిక రీనా (శ్రీనిధి శెట్టి) పాత్రకి తగిన ప్రాధాన్యమే లభించింది. ద్వితీయార్ధంలో ఆమె పాత్ర నేపథ్యంలో చక్కటి భావోద్వేగాలు పండాయి. సంజయ్‌దత్ (Sanjay dutt) అధీరాగా కనిపించిన తీరు బాగుంది. కానీ, ఆయన పాత్రకి జోడించిన బలమే సరిపోలేదు. రమికాసేన్ పాత్రని తెరపైకి తీసుకురావడం ఆకట్టుకుంటుంది. ఆ పాత్రలో రవీనాటాండన్(Raveena Tandon) చక్కటి అభినయం ప్రదర్శించారు. రావు రమేష్, ఈశ్వరీరావు, ప్రకాశ్‌రాజ్ తదితరుల పాత్రల పరిధి తక్కువే ప్రాధాన్యంతో కూడుకున్నవే.
సాంకేతిక విభాగాలు.. అత్యుత్తమ పనితీరుని కనబరిచాయి. రవి బస్రూర్ నేపథ్య సంగీతం హీరోయిజాన్ని మరింత హైలైట్ చేసింది. భువన్ గౌడ కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. కేజీయఫ్ గనుల్ని చూపించిన తీరు చాలా బాగుంటుంది. హాలీవుడ్ సినిమాల్ని ఏమాత్రం తీసిపోని రీతిలో సన్నివేశాలు కనిపిస్తాయి. మాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి. దర్శకుడు కేజీయఫ్ ఛాప్టర్1కి దీటుగా రెండో ఛాప్టర్‌ని తెరకెక్కించారు. హంగుల వరకు పర్వాలేదు కానీ, కథనం పరంగా కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.
బలాలు
+ రాఖీభాయ్ హీరోయిజం
+ నరాచీ సామ్రాజ్యాన్ని ఆవిష్కరించిన తీరు
+ నిర్మాణ విలువలు
+ ఛాయాగ్రహణం.. సంగీతం
బలహీనతలు
- గందరగోళంగా అనిపించే కథనం
చివరిగా: కేజీయఫ్ ఛాప్టర్-1కి దీటుగా ఛాప్టర్2 (KGF Chapter 2 review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ అంజలి, శ్రీతేజ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘బహిష్కరణ’. ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: బ్యాడ్ న్యూజ్.. విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?
Bad Newz movie review: విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైన్ ఎలా ఉంది? -
రివ్యూ: డార్లింగ్.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా?
ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటించిన రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే? -
రివ్యూ: భారతీయుడు2.. కమల్, శంకర్ కాంబో మరోసారి హిట్ అయిందా?
indian 2 review: కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్ కీలక పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు2’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ధూమం.. ఫహద్ ఫాజిల్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి కీలక పాత్రల్లో నటించిన ‘ధూమం’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
సోనియా సింగ్, పవన్ సిద్ధు నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే! -
రివ్యూ: వెబ్‌సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?
Mirzapur Season 3 Review: యువతను విశేషంగా ఆకట్టుకున్న సిరీస్‌ల్లో మీర్జాపూర్ ఒకటి. ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
Guruvayoor Ambalanadayil Review: పృథ్వీరాజ్ సుకుమార్, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉంది?
kalki 2898 ad review in telugu: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
Yakshini review in telugu: వేదిక, రాహుల్ విజయ్, మంచు లక్ష్మీ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘యక్షిణి’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
రివ్యూ: పరువు.. నివేదా పేతురాజ్ నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj), నటుడు నరేశ్ అగస్త్య (Naresh Agastya), నాగబాబు (Nagababu) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘పరువు’ (paruvu). ‘జీ 5’లో విడుదలైన ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: హరోం హర.. సుధీర్‌బాబు ఖాతాలో హిట్ పడిందా?
సుధీర్‌బాబు, మాళవిక శర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ‘హరోం హర’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మహారాజ.. విజయ్ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?
Maharaja Review: వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న విజయ్‌సేతుపతి కెరీర్లో 50వ చిత్రం ‘మహారాజ’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు మెప్పించింది? -
రివ్యూ: మిరల్.. ‘ప్రేమిస్తే’ భరత్ నటించిన చిత్రం భయపెట్టిందా?
ప్రేమిస్తే సినిమా హీరో భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘మిరల్’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. రివ్యూ మీకోసం.. -
రివ్యూ: కల్కి.. టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉంది?
మలయాళంలో మంచి టాక్ సొంతం చేసుకున్న టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ‘కల్కి’ మెప్పించిందా? -
రివ్యూ: మనమే.. శర్వానంద్, కృతిశెట్టిల మూవీ ఎలా ఉంది?
Manamey Movie Review: శర్వానంద్, కృతిశెట్టి జంటగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మెప్పించిందా? -
రివ్యూ: సత్యభామ.. కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాక్ ఏంటి?
కాజల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
Mr And Mrs Mahi Review: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది? -
రివ్యూ: కీచురాళ్ళు.. మలయాళ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
మలయాళంలో విజయవంతమైన ‘కీడమ్’ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’లో ‘కీచురాళ్ళుగా’ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
రివ్యూ: గం గం.. గణేశా.. ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ మూవీ మెప్పించిందా?
Gam Gam Ganesha Review: ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించిన మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: భజే వాయు వేగం.. కార్తికేయ హిట్ కొట్టారా?
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘భజే వాయు వేగం’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్‌పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!