Khakee: The Bihar Chapter Review: రివ్యూ: ఖాకీ: ది బిహార్ చాప్టర్
Khakee: The Bihar Chapter: పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ ఎలా ఉందంటే?
వెబ్‌సిరీస్: ఖాకీ: ది బిహార్ చాప్టర్; నటీనటులు: కరణ్ టక్కర్, అవినాష్ తివారి, అభిమన్యుసింగ్, నీరజ్ కశ్యప్, జతిన్ శరణ్, రవి కిషన్, అశుతోష్ రానా తదితరులు; సంగీతం: అద్వైత్ నిమేల్కర్; సినిమాటోగ్రఫీ: హరి నాయర్; ఎడిటింగ్: ప్రవీణ్ కతికులోత్; నిర్మాత: శీతల్ భాటియా; రచన: నీరజ్ పాండే; దర్శకత్వం: భవ్ దులియా; స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్
సాధారణ కథలతో పోలిస్తే పోలీసు కథా చిత్రాలను వెండితెరపై చూస్తే వచ్చే మజానే వేరు. మనం చేయలేని పనుల్ని పోలీస్‌గా హీరో అదరగొడుతుంటే బాగుంటుంది. సమాజంలోని వాస్తవ సంఘటనల ఆధారంగానే ఎన్నో పోలీస్ కథలు వెండితెరపై మెరిశాయి. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్ ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’(Khakee: The Bihar Chapter). నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది?
కథేంటంటే: చందన్ మాతో (అవినాష్ తివారి) కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్. ఒక సాధారణ గ్రామస్థుడిగా జీవితం మొదలు పెట్టి భూకబ్జాలు, అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా ఒక్కటేంటి.. అతడు చేయని నేరం అంటూ ఉండదు. బిహార్‌లోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఎదుగుతాడు. పోలీసులు కూడా అతడిని ఎప్పుడెప్పుడు పట్టుకుందామా? ఎన్కౌంటర్ చేద్దామా? అని ఎదురు చూస్తుంటారు. కానీ, రాజకీయ నేతలు, కొందరు పోలీస్ ఉన్నతాధికారుల అండదండలతో తప్పించుకుని తిరుగుతుండటమే కాదు, తనకు వ్యతిరేకంగా పనిచేసే వారిని దారుణంగా హత్యలు చేస్తాడు. ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న అమిత్లోథా (కరణ్ థాకర్) అనే యువ ఐపీఎస్ అధికారి బిహార్ వస్తాడు. తన శక్తి సామర్థ్యాలతో సమస్యలను పరిష్కరించడంతో.. చందన్ మాతోను పట్టుకునే బాధ్యత ప్రభుత్వం అతడికి అప్పగిస్తుంది. మరి చందన్‌ను.. అమిత్ ఎలా పట్టుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు చందన్ దొరికాడా?
ఎలా ఉందంటే: ఒకప్పుడు బిహార్ అంటే.. రౌడీలు, గుండాలు, గ్యాంగ్స్టర్ల అడ్డాగా ఉండేది. వారి ఆగడాలను కట్టడి చేయడం అక్కడి పోలీసులకు కూడా సాధ్యమయ్యేది కాదు. కొన్ని చోట్ల ఈ గ్యాంగ్స్టర్స్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతారంటే ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు. అలాంటి ఒక క్రిమినల్‌కు, ఉడుకురక్తం కలిగిన ఐపీఎస్ అధికారికి మధ్య జరిగిన పోరు ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’. 2000 నుంచి 2010 మధ్యలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. చందన్ మాతోను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించే సన్నివేశంతో సిరీస్‌ను మొదలు పెట్టాడు దర్శకుడు. ఉన్నతాధికారుల స్వార్థ ప్రయోజనాల కోసం చివరి నిమిషంలో అలాంటి ఆపరేషన్స్ ఎలా ఆగిపోతాయో చాలా ఉత్కంఠగా చూపించారు. అమిత్ లోథా బిహార్ రావడం, అక్కడ ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వెళ్లడం ఇలా అతడి పరిచయంతో మొదటి ఎపిసోడ్ ముగుస్తుంది. అసలు చందన్ మాతో గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? ఎలాంటి కూర్రమైన నేరాలు చేశాడన్న విషయాలతో రెండో ఎపిసోడ్‌ను తీర్చిదిద్దారు. నాయకుడు, ప్రతినాయకుడి పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి కాస్త ఎక్కువ నిడివి తీసుకున్నారేమో అనిపిస్తుంది. బిహార్‌లో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం కథలో భాగంగా ప్రస్తావించడంతో సన్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి.
పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నారని తెలిసిన వారిని చందన్ మాతో దారుణంగా హత్య చేయడంతో అతడిని పట్టుకునే బాధ్యత అమిత్ లోథాకు అప్పగిస్తుంది ప్రభుత్వం. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇద్దరి మధ్యా పోలీస్ vs గ్యాంగ్‌స్టర్ పోరు సాగుతుంది. చందన్‌ను పట్టుకునేందుకు అమిత్ సాగించే ఇన్వెస్టిగేషన్ కొత్తగా అనిపించినా.. గతంలో ఒకట్రెండు సినిమాల్లో మనం చూసిందే. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ ఇప్పుడు సర్వ సాధారణం. కానీ, 2005 నాటికి అది చాలా మందికి తెలియదు. ఆయా సన్నివేశాలు అలరిస్తాయి. పోలీసులకు దిలిప్ సాహు(జతిన్ శరణ్)ల మధ్య సాగే సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి. ఈ కథా, నేపథ్యం పూర్తిగా వేరైనా అక్కడక్కడా కార్తి ‘ఖాకీ’ను గుర్తు చేస్తుంది. మొదటి మూడు ఎపిసోడ్లలో కథను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్లిన దర్శకుడు.. నాలుగో ఎపిసోడ్ నుంచే అసలు ట్విస్ట్‌లు మొదలుపెడతాడు. అక్కడి నుంచి సాగే ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉంటాయి. అయితే, చివరిలో ఛేజింగ్ ఎపిసోడ్, ముగింపు మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలను చూసే ఆసక్తి ఉన్నవారు ఈ వీకెండ్లో ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ ప్రయత్నించవచ్చు. తెలుగులో ఆడియో కూడా అందుబాటులో ఉంది. అయితే, నిడివి ఒక్కటే కాస్త ఇబ్బంది.
ఎవరెలా చేశారంటే: ‘ఖాకీ: ది బిహార్ చాప్టర్’ (Khakee: The Bihar Chapter) లో ప్రతి నటుడు ఆయా పాత్రలకు చక్కగా సరిపోయారు. ఐపీఎస్ అధికారి అమిత్ లోథాగా కరణ్ చాలా బాగా నటించారు. దాదాపు ఆరున్నర గంటల నిడివి కలిగిన ఈ వెబ్‌సిరీస్‌లో ఈయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ. అందుకు తగినట్లు ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. నాటి వ్యవస్థల పనితీరు నచ్చకపోయినా, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆ పాత్ర నడుచుకునే తీరు బాగుంది. ప్రతినాయకుడు చందన్ మాతోగా అన్వేష్ తివారి ఓకే. ఆ పాత్రను, ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా వెబ్‌సిరీస్ ఓకే. 2000 నాటి పరిస్థితులను చూపించటానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. చాలా సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా.. వాస్తవికత కోసం వదిలేశారు. అవన్నీ ప్రేక్షకుడికి విసిగిస్తాయి. నీరజ్ పాండే స్క్రిప్ట్‌ను ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. పాత్రలు, వాటి పరిచయం, అసలు పాయింట్‌కు రావడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. అలాగే చాలా పాత్రలను త్వరగా ముగించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా ట్విస్ట్‌లు మినహా సన్నివేశాలు కూడా సాధారణంగా సాగుతాయి.
బలాలు
+ నటీనటులు, + కథా నేపథ్యం, + కొన్ని ట్విస్ట్‌లు
బలహీనతలు
- నిడివి, - పాత్రలను ముగించిన తీరు
చివరిగా: ఖాకీ: ది బిహార్ చాప్టర్.. సూపర్ పోలీస్ వర్సెస్ గ్యాంగ్‌స్టర్ పోరు..
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?
అవికా గోర్, వర్ధన్ పూరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బ్లడీ ఇష్క్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందంటే? -
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాయన్’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను అలరించిందా? -
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్‌తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా రామ్ భీమన దర్శకత్వంలో రూపొందిన ‘పురుషోత్తముడు’ మూవీ ప్రేక్షకులను అలరించిందా? -
రివ్యూ: బహిష్కరణ.. అంజలి వేశ్యగా నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ అంజలి, శ్రీతేజ ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘బహిష్కరణ’. ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: బ్యాడ్ న్యూజ్.. విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ మూవీ అలరించిందా?
Bad Newz movie review: విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఎంటర్టైన్ ఎలా ఉంది? -
రివ్యూ: డార్లింగ్.. ప్రియదర్శి, నభానటేష్‌ల కామెడీ ఎంటర్టైనర్ మెప్పించిందా?
ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటించిన రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే? -
రివ్యూ: భారతీయుడు2.. కమల్, శంకర్ కాంబో మరోసారి హిట్ అయిందా?
indian 2 review: కమల్‌హాసన్, సిద్ధార్థ్, రకుల్ కీలక పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు2’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ధూమం.. ఫహద్ ఫాజిల్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
ఫహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి కీలక పాత్రల్లో నటించిన ‘ధూమం’ ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?
సోనియా సింగ్, పవన్ సిద్ధు నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే! -
రివ్యూ: వెబ్‌సిరీస్: మీర్జాపూర్ సీజన్-3.. క్రైమ్, యాక్షన్ సిరీస్-3 మెప్పించిందా?
Mirzapur Season 3 Review: యువతను విశేషంగా ఆకట్టుకున్న సిరీస్‌ల్లో మీర్జాపూర్ ఒకటి. ఇప్పుడు మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: ‘గురువాయూర్ అంబలనాదయిల్’.. మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?
Guruvayoor Ambalanadayil Review: పృథ్వీరాజ్ సుకుమార్, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో విపిన్ దాస్ దర్శకత్వం వహించిన ‘గురువాయూర్ అంబలనాదయిల్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: ‘కల్కి 2898 ఏడీ’.. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉంది?
kalki 2898 ad review in telugu: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: యక్షిణి.. సోషియో ఫాంటసీ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
Yakshini review in telugu: వేదిక, రాహుల్ విజయ్, మంచు లక్ష్మీ, అజయ్ కీలక పాత్రల్లో నటించిన ‘యక్షిణి’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
రివ్యూ: పరువు.. నివేదా పేతురాజ్ నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj), నటుడు నరేశ్ అగస్త్య (Naresh Agastya), నాగబాబు (Nagababu) ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘పరువు’ (paruvu). ‘జీ 5’లో విడుదలైన ఈ సిరీస్ రివ్యూ మీకోసం.. -
రివ్యూ: హరోం హర.. సుధీర్‌బాబు ఖాతాలో హిట్ పడిందా?
సుధీర్‌బాబు, మాళవిక శర్మ, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ‘హరోం హర’ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మహారాజ.. విజయ్ సేతుపతి 50వ మూవీ మెప్పించిందా?
Maharaja Review: వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న విజయ్‌సేతుపతి కెరీర్లో 50వ చిత్రం ‘మహారాజ’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఏ మేరకు మెప్పించింది? -
రివ్యూ: మిరల్.. ‘ప్రేమిస్తే’ భరత్ నటించిన చిత్రం భయపెట్టిందా?
ప్రేమిస్తే సినిమా హీరో భరత్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘మిరల్’. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. రివ్యూ మీకోసం.. -
రివ్యూ: కల్కి.. టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉంది?
మలయాళంలో మంచి టాక్ సొంతం చేసుకున్న టొవినో థామస్ యాక్షన్ ఫిల్మ్ ‘కల్కి’ మెప్పించిందా? -
రివ్యూ: మనమే.. శర్వానంద్, కృతిశెట్టిల మూవీ ఎలా ఉంది?
Manamey Movie Review: శర్వానంద్, కృతిశెట్టి జంటగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా మెప్పించిందా? -
రివ్యూ: సత్యభామ.. కాజల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాక్ ఏంటి?
కాజల్ ప్రధాన పాత్రలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో వచ్చిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
Mr And Mrs Mahi Review: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్‌రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం