krish 4: క్రిష్‌-4 కోసం భారీ సన్నాహాలు! ఈసారి ప్రత్యేకతలేంటంటే?

బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ రోషన్ ‌(Rakesh Roshan) ‘కోయి మిల్‌ గయా’(2003) చిత్రంతో ‘జాదు’ని ప్రేక్షకులకి పరిచయం చేశారు. జాదు ఇచ్చిన పవర్స్‌తో హృతిక్‌ రోషన్(Hrithik Roshan)

Published : 18 Aug 2022 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ దర్శకుడు రాకేశ్‌ రోషన్ ‌(Rakesh Roshan) ‘కోయి మిల్‌ గయా’(2003) చిత్రంతో ‘జాదు’ని ప్రేక్షకులకి పరిచయం చేశారు. జాదు ఇచ్చిన పవర్స్‌తో హృతిక్‌ రోషన్(Hrithik Roshan) సూపర్‌ హీరో ‘క్రిష్’(Krrish)(2006)గా ఎంట్రీ ఇచ్చాడు. మానవాతీత శక్తులు కలిగిన ‘క్రిష్’ విన్యాసాలకు అప్పట్లో దేశం మొత్తం అబ్బురపడింది. దానిని కొనసాగిస్తూ వచ్చిన ‘క్రిష్-3’(Krrish 3)(2013) సైతం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ వరుసలో రావాల్సిన ‘క్రిష్-4’(Krrish 4) విషయంలో మాత్రం జాప్యం కొనసాగుతోంది.

గతేడాది ఈ చిత్రంపై హృతిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్‌ చేశాడు. క్రిష్ పాత్ర పుట్టి 15సంవత్సరాలైన సందర్భంగా అభినందనలు చెబుతూ ‘గతం వెళ్లిపోయింది. భవిష్యత్‌లో ఏం జరగనుందో చూద్దాం.. క్రిష్‌-4’ అంటూ కీలక అప్‌డేట్‌ని ఇచ్చాడు. అక్కడి నుంచి ఈ సినిమాపై విపరీతమైన ప్రచారం జరగడంతో దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ ‘క్రిష్‌-4 కథ సిద్ధమవుతోంది. ఎప్పుడు ప్రారంభమవుతుందనేది మేమే ప్రకటిస్తాం’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిష్ చిత్రాల పరంపరను ప్రత్యేకంగా కొనసాగిస్తున్న రోషన్‌ ఫ్యామిలి ‘క్రిష్‌-4’ ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నట్లు ప్రచారం సాగుతోంది. క్రిష్‌ చిత్రాల రచయిత హనీ ఇరానీ కథ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్‌-4 స్టోరీలైన్‌పై బాలీవుడ్‌లో పలు కథనాలు వార్తలుగా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా క్రిష్-3 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే క్రిష్-4 ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

అంతరిక్ష నేపథ్యం, టైమ్‌ ట్రావెల్ స్టోరీగా ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా క్రిష్‌ తండ్రి రోహిత్‌ మెహ్రాను టైం ట్రావెల్‌ సహాయంతో వెనక్కి తీసుకురావడమే (బ్రింగ్‌ బ్యాక్‌ రోహిత్‌ మెహ్రా) ప్రధానాంశంగా క్రిష్‌-4 కథనం ఉంటుందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘జాదు’ కి కూడా కీలకపాత్ర ఉంటుందట. మరోవైపు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని, ప్రధాన పాత్రను హృతిక్‌ పోషించగా, సౌత్‌ ఇండస్ట్రీ నుంచి మరో పెద్ద హీరోని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ‘క్రిష్‌-4’ని అత్యాధునిక సూపర్‌ హీరో సైన్స్‌ ఫిక్షన్‌గా రూపొందించనున్నారట. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ ‘విక్రమ్‌ వేద’ (Vikram Vedha)లో నటిస్తున్నారు. దాని తరువాత భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రం ‘ఫైటర్‌’(Fighter) ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘ఫైటర్‌’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. మరోవైపు క్రిష్-4 కథ సిద్ధమవుతోంది. మరి క్రిష్‌-4 ముందొస్తుందా? లేక ‘ఫైటర్‌’ వస్తుందా అనేది ప్రకటించాల్సి ఉంది.  


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని