Bigg boss telugu 6: బిగ్‌బాస్‌ సీజన్‌-6.. నాగార్జున పారితోషికం భారీగా పెరిగిందా?

బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. త్వరలోనే ‘సీజన్‌6’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 22 Aug 2022 02:14 IST

హైదరాబాద్‌: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. త్వరలోనే ‘సీజన్‌6’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌-6లో పాల్గొనే కంటెస్టెంట్‌ల ఎంపిక ప్రక్రియ మొదలైంది. మరోవైపు ప్రీపొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ సారి కూడా అగ్ర నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే సదరు టెలివిజన్ ఛానల్‌ ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. సీజన్‌-6కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున పారితోషికం బాగా పెరిగినట్లు సమాచారం. ఈ సీజన్‌కోసం ఆయన రూ.15కోట్లు తీసుకుంటున్నారని టాక్‌.

బిగ్‌బాస్‌ సీజన్‌-6 సెప్టెంబరు 4 నుంచి టెలికాస్ట్‌ కానుంది.  ఈ సీజన్‌లో ఎంతమంది పాల్గొంటారు? ఎవరెవరు ఉంటారన్న విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు నాగార్జున సీజన్‌-5కు ఎపిసోడ్‌కు రూ.12లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అంటే మొత్తం సీజన్‌కు రూ.12కోట్ల వరకూ డిస్నీ+హాట్‌స్టార్‌ చెల్లించింది. ఇప్పుడు సీజన్‌-6 రూ.15కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సల్మాన్‌ఖాన్‌ హిందీలో బిగ్‌బాస్‌ సీజన్‌-15 కోసం రూ.350కోట్లు తీసుకుంటున్నారని టాక్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని