విభిన్న ప్రేమకథలో?

‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటించబోయే చిత్రంపై స్పష్టత వస్తోంది. ఆమె త్వరలో మహేష్‌ అనే యువ దర్శకుడితో ఓ సినిమా చేయబోతుంది. ఇందులో అనుష్క సరసన నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించనున్నారని సమాచారం.....

Published : 20 Mar 2021 12:10 IST

‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటించబోయే చిత్రంపై స్పష్టత వస్తోంది. ఆమె త్వరలో మహేష్‌ అనే యువ దర్శకుడితో ఓ సినిమా చేయబోతుంది. ఇందులో అనుష్క సరసన నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించనున్నారని సమాచారం. ఓ విభిన్నమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తుంది. పాతికేళ్ల కుర్రాడితో.. నలభై ఏళ్ల మహిళ ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అన్నది ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించనున్నారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుందని తెలిసింది. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్‌ సంస్థ నిర్మించబోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని