‘101 జిలాల్ల అందగాడు’ ప్రోమో సాంగ్‌ విడుదల

అవసరాల శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రుహానీ శర్మ కథానాయిక. దిల్‌రాజు - క్రిష్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర.........

Updated : 07 Dec 2022 22:07 IST

ఇంటర్నెట్ డెస్క్: అవసరాల శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రుహానీ శర్మ కథానాయిక. దిల్‌రాజు - క్రిష్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రానికి సంబంధించి తాజాగా ‘‘నూటొక్క జిల్లాల అందగాడు’’ సాంగ్‌ ప్రొమోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకి భాస్కరభట్ల సాహిత్యం అందించగా సింహా ఆలపించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీత స్వరాలు సమకూర్చారు. మే 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని