మళ్లీ కెమెరా ముందుకొచ్చిన ఆమీర్‌ఖాన్‌ దంపతులు

బాలీవుడ్‌ జంట ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావు తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ నిన్న ప్రకటించారు. దీనిపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలామంది అభిమానులు మాత్రం విచారం వ్యక్తం చేశారు. దీంతో ఈ బాలీవుడ్‌ జంట మరోసారి కెమెరా ముందుకు వచ్చి తమ విడాకులపై మాట్లాడారు.

Updated : 05 Jul 2021 06:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ జంట ఆమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ శనివారం ప్రకటించారు. దీనిపై సోషల్‌ మీడియాలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలామంది అభిమానులు మాత్రం విచారం వ్యక్తం చేశారు. దీంతో ఈ బాలీవుడ్‌ జంట మరోసారి కెమెరా ముందుకు వచ్చి తమ విడాకులపై మాట్లాడారు. తమ విడాకుల వార్తతో చాలామంది బాధపడి ఉండవచ్చు. తాము దంపతులుగా విడిపోయినా ఇప్పటికీ ఒకే కుటుంబంలో భాగమేనని పేర్కొన్నారు. బంధాలు మారినా ఒకరికోసం ఒకరం అండగా నిలబడి ఉంటామని చెప్పుకొచ్చారు. కాబట్టి ఎవరూ వేరే విధంగా ఆలోచించవద్దని వారు ఆ వీడియోలో కోరారు.

ఎప్పటి నుంచో విడిపోదామనుకుంటున్న ఆమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు దంపతులు తమ విడాకుల విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. జులై 3న విడాకుల విషయాన్ని ప్రకటిస్తూ.. ‘తాము తీసుకున్న ఈ నిర్ణయం ముగింపు కాదని.. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’ అని పేర్కొన్నారు. భార్యభర్తలుగా విడిపోయినా తమ పిల్లలకు తల్లిదండ్రులుగా కొనసాగుతామని చెప్పారు. మొదటి భార్య రీనా దత్తా నుంచి విడాకులు తీసుకున్న అనంతరం కిరణ్‌రావుని ఆమీర్‌ఖాన్‌ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమీర్‌ నటించిన ‘లగాన్‌’ చిత్రానికి కిరణ్‌రావు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2005 డిసెంబర్‌ 28 వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. 2011లో ఆజాద్‌ అనే బాబుకి సరోగసి పద్ధతిలో ఈ దంపతులు జన్మనిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని