Priyanka chopra: బాలీవుడ్‌ స్టార్‌డమ్‌ను హాలీవుడ్‌లో చూపించలేదు: ప్రియాంక చోప్రా

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందినా.. ఆ స్టార్‌డమ్‌ను హాలీవుడ్‌లో చూపించలేదని అంటున్నారు.. నటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌ నుంచి అంతర్జాతీయ నటిగా ఆమె ఎదిగిన తీరు ఎంతో మంది నటీనటులకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తాజాగా ఆమె నటించిన హాలీవుడ్‌

Published : 23 Dec 2021 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందినా.. ఆ స్టార్‌డమ్‌ను హాలీవుడ్‌లో చూపించలేదని అంటున్నారు నటి ప్రియాంక చోప్రా. బాలీవుడ్‌ నుంచి అంతర్జాతీయ నటిగా ఆమె ఎదిగిన తీరు ఎంతో మంది నటీనటులకు ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తాజాగా ఆమె నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘ది మ్యాట్రిక్స్‌ రీసర్రెక్షన్స్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రియాంక ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో అవకాశాల కోసం తను పడిన కష్టం గురించి చెప్పుకొచ్చారు.

‘‘ఏడేళ్ల కిందట యూఎస్‌కి వెళ్లి హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశాలు పొందడానికి చాలా కష్టపడ్డాను. భారత్‌లో నాకున్న స్టార్‌డమ్‌ గురించి ఎవరికీ చెప్పలేదు.. చూపించలేదు. ఒక కొత్త నటిలా ప్రతి స్టూడియోకి వెళ్లి అవకాశం ఇవ్వమని కోరాను. అనేక ఆడిషన్లలో పాల్గొన్నాను. నేను కూడా కీలక పాత్రలు, ప్రధాన పాత్రలు పోషిస్తానని నిరూపించడం కష్టతరంగా ఉండేది’’అని ప్రియాంక వెల్లడించారు. అంతర్జాతీయ చిత్రసీమలో దక్షిణాసియా నటులకు అవకాశాలు తక్కువగా ఉండేవని.. ఇప్పుడు తను, మరికొందరు నటులు ఆ లోటును తీర్చడం ప్రారంభించామని ప్రియాంక తెలిపారు. అయితే, ఇంకా అనేక మంది నటులు అంతర్జాతీయంగా రాణించాలని కాంక్షించారు. 2015లో ‘క్వాంటికో’ చిత్రంతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీబిజీగా ఉంటున్నారు. అమెరికన్‌ సింగర్‌ నిక్‌జోనస్‌ని పెళ్లాడి.. అక్కడే స్థిరపడిపోయారు. 

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని