Pushpa 2: ‘పుష్ప2’లో సాయి పల్లవి?

అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది

Published : 06 Sep 2022 16:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రైజ్‌’. గతేడాది విడుదలైన మొదటి భాగం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.  రెండో భాగం ‘పుష్ప:ది రూల్‌’ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. తొలి భాగానికి మంచి ఆదరణ లభించడంతో ఆ అంచనాలకు తగ్గకుండా సుకుమార్‌ రెండో భాగాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ‘పుష్ప2’కు మరింత క్రేజ్‌ తీసుకొచ్చే పనిలో ఉంది చిత్ర బృందం. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి, మనోజ్ బాజ్‌పాయ్‌లు  నటిస్తారంటూ వార్తలు వచ్చాయి. అయితే, అలాంటివేవీ లేవంటూ నిర్మాణ సంస్థ తెలిపింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈసినిమాలో ఓ కీలక పాత్ర కోసం సాయిపల్లవి (Sai pallavi)ని సంప్రదించారట. సుకుమార్‌ ఆమెను కలిసి కథను వినిపించినట్లు సమాచారం. అన్నీ కుదిరితే గిరిజన యువతి పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని