Raadhika: ఫ్రెంచ్ సినిమాలో రాధిక.. ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్‌..

నటి రాధిక (Raadhika Sarathkumar) ఓ ఫ్రెంచ్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

Published : 25 Oct 2023 10:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి రాధిక (Raadhika). దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె ఇప్పుడు విదేశీ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్నట్లు రాధిక తెలిపారు. ‘‘సినీ కెరీర్‌లో కొత్త ప్రయాణం మొదలైంది. ఫ్రెంచ్‌ సినిమాలో నటిస్తున్నాను. తొలి రోజు షూటింగ్‌లో పాల్గొన్నాను. కొత్త అనుభూతిని పొందనున్నా. ఈ విషయంలో నా భర్త శరత్‌కుమార్ ఎంతో ప్రోత్సహించారు’’ అంటూ ఆయనకు థ్యాంక్స్‌ చెప్పారు. అలాగే షూటింగ్‌ ఫొటోలను కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. 

ఇక 1978లో భారతీరాజ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ తమిళ చిత్రంతో రాధిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. ఈ ఏడాది నాలుగు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘చంద్రముఖి-2’ ఇటీవల విడుదలైంది. అలాగే విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ధ్రువ నక్షత్రం’లోనూ రాధిక కీలకపాత్ర పోషించనున్నారు. తాజాగా దీని ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని