Satya Dev: ‘గాడ్‌ ఫాదర్‌’ ప్లస్సే.. ఆ మాజీ క్రికెటర్‌ బయోపిక్‌లో నటించాలనుంది: సత్యదేవ్‌

సత్యదేవ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ సినిమా మే 10న విడుదల కానుంది.

Published : 09 May 2024 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సత్యదేవ్‌ (Satya Dev) హీరోగా కొత్త దర్శకుడు వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). అతీరా రాజ్‌, అర్చన హీరోయిన్లు. ప్రముఖ డైరెక్టర్‌ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ సినిమా మే 10న విడుదల కానుంది. ఈసందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ఈక్రమంలో.. తాను గతంలో కీలక పాత్ర పోషించిన ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) సినిమా గురించి ప్రశ్న ఎదురవగా సత్యదేవ్‌ స్పందించారు. ‘‘గాడ్‌ ఫాదర్‌’లో విలన్‌గా నటించారు. అది మీకు ప్లస్‌ అయిందా, మైనస్‌ అయిందా?’ అని విలేకరి ప్రశ్నించగా కచ్చితంగా ప్లస్సే అని తెలిపారు. తాను అప్పటివరకూ చేసిన పాత్రలు ఒకెత్తైతే ‘గాడ్‌ ఫాదర్‌’ రోల్‌ మరో ఎత్తని పేర్కొన్నారు. చిరంజీవి (Chiranjeevi)లాంటి హీరోతో కలిసి పని చేయడమంటే నటుడిగా మరో మెట్టు ఎక్కినట్టే అని అభిప్రాయపడ్డారు. ఆ స్థాయిలో ఉండే క్యారెక్టర్స్‌ మళ్లీ రాలేదని, ఒకవేళ ఆ అవకాశం వచ్చి ఉంటే నటించేవాడినని చెప్పారు.

‘కృష్ణమ్మ’ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇందులో ఎలాంటి రాజకీయాన్ని చూపించలేదు. ఈ చిత్రంలో విజయవాడ కొత్తగా కనిపిస్తుంది. నేను ఆశిస్తున్న ఫలితాన్ని ఈ సినిమాతో అందుకుంటాననే నమ్మకం ఉంది’’ అని అన్నారు. బయోపిక్స్‌పై స్పందిస్తూ.. భారత మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు (Ambati Rayudu) బయోపిక్‌ తెరకెక్కే అవకాశాలుంటే అందులో నటించాలనుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు