Rajinikanth: రజనీ బయోపిక్‌ రానుందా?

సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్‌ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు.

Updated : 02 May 2024 09:47 IST

సినిమాల్లో తమ అభిమాన హీరోలు చేసే యాక్షన్‌ హంగామాను చూస్తూ మురిసిపోతుంటారు ప్రేక్షకులు. మరి అలాంటి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న హీరో జీవితమే తెరపై వస్తే సినీప్రియులకి పండగే కదా. బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలతో దర్శకనిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సాజిద్‌ నడియాడ్‌వాలా. ఇప్పుడాయన తమిళ అగ్రకథానాయకుడు రజనీకాంత్‌ బయోపిక్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘సాజిద్‌ కేవలం రజనీకాంత్‌ నటనకు మాత్రమే కాదు. ఆయన వ్యక్తిత్వానికి కూడా వీరాభిమాని అనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయన జీవితాన్ని తెరపై చూపించాలని నిర్ణయించుకున్నారు సాజిద్‌. బస్‌ కండక్టర్‌ నుంచి సూపర్‌ స్టార్‌ వరకు ఎదగడానికి రజనీకాంత్‌ ఎదుర్కొన్న సవాళ్లను ఒక సినిమాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టు కోసం ఆయన కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు’’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు