బోయపాటి దర్శకత్వంలో రామ్‌?

యువ కథానాయకుడు రామ్‌ పోతినేని ‘ఇస్టార్ట్‌ శంకర్‌’ ఇచ్చిన విజయంతో ఉత్సహంగా ఈ ఏడాది ‘రెడ్‌’ చిత్రంలో నటించి అలరించారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు ‘ఆవారా’ ఫేమ్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

Published : 21 Mar 2021 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్: యువ కథానాయకుడు రామ్‌ పోతినేని ‘ఇస్టార్ట్‌ శంకర్‌’ ఇచ్చిన విజయంతో ఉత్సహంగా ఈ ఏడాది ‘రెడ్‌’ చిత్రంలో నటించి అలరించారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు ‘ఆవారా’ ఫేమ్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘ఉప్పెన’ చిత్ర కథానాయిక కృతి శెట్టి, రామ్‌ సరసన నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే రామ్‌కి - బోయపాటి కథ చెప్పాడట. అందుకు రామ్ కూడా సానుకూలత తెలిపారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బోయపాటి శ్రీను - ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందరెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇది పూర్తికాగానే రామ్‌ - బోయపాటిల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని