Ram Charan: ప్రత్యేకం న్యూజిలాండ్ పాట
శంకర్ సినిమా అనగానే భారీ హంగులే గుర్తొస్తాయి. ప్రతి సన్నివేశంపైనా తనదైన ముద్ర కనిపిస్తుంటుంది. ఇక పాటలు, పోరాట ఘట్టాలైతే మరింత ప్రత్యేకం అనిపిస్తాయి.
శంకర్ (Shankar) సినిమా అనగానే భారీ హంగులే గుర్తొస్తాయి. ప్రతి సన్నివేశంపైనా తనదైన ముద్ర కనిపిస్తుంటుంది. ఇక పాటలు, పోరాట ఘట్టాలైతే మరింత ప్రత్యేకం అనిపిస్తాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ అద్భుతం అనిపించేలా సన్నివేశాల్ని మలుస్తున్నట్టు సమాచారం. ఇటీవలే ఓ పాట చిత్రీకరణ కోసం న్యూజిలాండ్ వెళ్లిన చిత్రబృందం... అక్కడ షెడ్యూల్‌ని పూర్తి చేసింది. ఆ విషయాన్ని రామ్‌చరణ్ ట్విటర్ ద్వారా తెలిపారు. న్యూజిలాండ్‌లోని పలు ప్రదేశాల్లో దాదాపు ఎనిమిది రోజులపాటు ఓ పాటని తెరకెక్కించారు. ఈ పాట, విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, దర్శకుడు శంకర్, నృత్య దర్శకులు బాస్కో సీజర్, ఛాయాగ్రాహకుడు తిరు ఈ పాటని మరింత ప్రత్యేకం చేశారంటూ చరణ్ ట్వీట్ చేశారు. ఇందులో రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఆయనకి ఇది 50వ చిత్రం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
SKY: క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ప్రశాంతంగా ఉండటం అలా వచ్చిందే..: సూర్యకుమార్
-
Politics News
KTR: పీఎం కేర్స్‌పై కేంద్రం వివరణ.. అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్
-
Sports News
IND vs NZ: ఉమ్రాన్ ఇంకా నేర్చుకోవాలి.. మణికట్టు మాంత్రికుడు ఉండాల్సిందే: వసీమ్ జాఫర్
-
India News
Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్.. బడ్జెట్లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్‌ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ