Saipallavi: కమల్‌తో.. సాయిపల్లవి

కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంయుక్త నిర్మాణంలో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రాజ్‌   కుమార్‌

Updated : 11 May 2022 08:43 IST

కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌ కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్స్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంయుక్త నిర్మాణంలో శివకార్తికేయన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. రాజ్‌   కుమార్‌ పేరిసామి దర్శకుడు. ఈ చిత్రంలో కథానాయికగా సాయిపల్లవి నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ  సందర్భంగా కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ఈ కథలో భిన్న కోణాలుంటాయనీ, ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు. శివకార్తికేయన్‌, సాయిపల్లవి, రాజ్‌కుమార్‌ వంటి ప్రతిభావంతులతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు.

‘విక్రమ్‌’.. ప్రచార జోరు

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 11న తొలి పాటను, 15న సాయంత్రం 6 గంటలకు చిత్ర ట్రైలర్‌, ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇందులో కమల్‌ ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: గిరీష్‌ గంగాధరన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు