Shilpa Shetty: గన్ను పట్టిన శిల్ప

మరో అగ్ర కథానాయిక ఓటీటీలో ఆరంగేట్రం చేయనుంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’. ఇందులో శిల్పాశెట్టి నటిస్తున్నట్లు చిత్రబృందం తాజాగా

Updated : 25 Apr 2022 08:18 IST

మరో అగ్ర కథానాయిక ఓటీటీలో ఆరంగేట్రం చేయనుంది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’. ఇందులో శిల్పాశెట్టి నటిస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె పాత్రకు సంబంధించి పోస్టర్‌ను విడుదల చేశారు. బ్లాక్‌ యూనిఫాంలో, తుపాకీ పట్టుకున్న పోలీసు  అధికారిగా ఇందులో శిల్ప కనిపిస్తోంది. తొలిసారిగా ఓటీటీ ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందని తను ఇన్‌స్టాలో తన ఆనందాన్ని పంచుకుంది. ఈ వెబ్‌సిరీస్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని