Sukruthiveni: సందేశమిచ్చే గాంధీ తాత చెట్టు

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది.

Updated : 02 May 2024 09:51 IST

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి బాలనటిగా తెరకు పరిచయం కానుంది. ఆమె ప్రధాన పాత్రలో పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఆ చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తబితా సుకుమార్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమాని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంగా రూపొందించిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా పలు చిత్రోత్సవాల్లో సత్తా చాటింది. తాజాగా ఈ చిత్రానికి గానూ 14వ దాదా సాహెబ్‌ ఫాల్కే చిత్రోత్సవాల్లో సుకృతి ఉత్తమ బాలనటిగా పురస్కారం అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని