
RRR: ‘ఆర్ఆర్ఆర్’ కొత్త గీతం.. ‘జనని’ భావోద్వేగం.. సాంగ్ వచ్చేసింది
ఇంటర్నెట్ డెస్క్: సినీ ప్రియులకు ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం మరో కానుక అందించింది. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచారు. ఆర్ఆర్ఆర్ సోల్ యాంథమ్(RRR Soul Anthem) ‘జనని’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన పాటకు ఆయనే సాహిత్యం అందించి ఆలపించారు. ఆద్యంతం భావోద్వేగంతో సాగిన ‘జనని’ పాటన మీరూ చూసేయండి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.