keeravani: అధునాతన సాంకేతికతతో..

సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్‌ ఛైర్మన్‌ ఎం.ఎస్‌.ఆర్‌.వి.ప్రసాద్‌.

Updated : 27 Apr 2024 09:27 IST

సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్‌ ఛైర్మన్‌ ఎం.ఎస్‌.ఆర్‌.వి.ప్రసాద్‌. స్టూడియోలో కొత్తగా నెలకొల్పిన డాల్బీ మిక్సింగ్‌, సౌండ్‌ డిజైన్‌ యూనిట్లని శుక్రవారం ప్రారంభించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, యువ సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర చేతులమీదుగా ఈ స్టూడియోలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా  ఎం.ఎస్‌.ఆర్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నేటి సాంకేతికతని దృష్టిలో ఉంచుకుని డాల్బీ, సౌండ్‌ డిజైన్‌ యూనిట్లని ఏర్పాటు చేశాం. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కల్కి’ ఈ కొత్త సాంకేతికతతోనే ముస్తాబవుతోంద’’ని తెలిపారు.  స్డూడియో డైరెక్టర్‌ కె.వి.రావు మాట్లాడుతూ ‘‘సినిమా అంటే సౌండింగ్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అందుకే ఈ కొత్త సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కె.ఎస్‌.రామారావు, కె.ఎల్‌.నారాయణ, దామోదర్‌ ప్రసాద్‌, రచయిత విజయేంద్రప్రసాద్‌, సంగీత దర్శకుడు భీమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని