parada: ప్రేమ ‘పరదా’

అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన.

Updated : 27 Apr 2024 09:26 IST

నుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్‌ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. తన రెండో చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అనుపమతోపాటు దర్శన రాజేంద్రన్‌, సంగీత కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ డొంకాడ, శ్రీనివాసులు.పి.వి, శ్రీధర్‌ మక్కువ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘పరదా’ అనే పేరుని ఖరారు చేశారు. ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ లవ్‌... అనే శీర్షికతో పేరు మొదలవుతుంది. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌నీ, కాన్సెప్ట్‌ వీడియోనీ కథానాయిక సమంత, దర్శకనిర్మాతలు రాజ్‌, డీకే విడుదల చేశారు. దేవత విగ్రహాన్ని చూపిస్తూ మొదలయ్యే వీడియోలో మనుస్మృతిలోని శ్లోకం వినిపిస్తూ ఉంటుంది. మహిళల చుట్టూ సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోందని లుక్‌ స్పష్టం చేస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వినోదాన్ని పంచడమే కాకుండా... లోతైన భావాలతో, ఆకట్టుకునే కథనంతో ఈ చిత్రం రూపొందుతోంద’’న్నారు. నిర్మాత విజయ్‌ డొంకాడ మాట్లాడుతూ ‘‘మా సినిమా కథ మాత్రమే కాదు, ఓ అనుభవం. ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయాణం’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని