Varisu: విజయ్ 66.. రష్మిక 17..‘వారిసు’ విశేషాలివి!
విజయ్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘వారసుడు’. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘వారసుడు’ సంగతులు చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద చిత్రాల్లో ‘వారిసు’ ఒకటి. తెలుగులో ‘వారుసుడు’ పేరుతో విడుదలకానుంది. ఈ సినిమా విశేషాలేంటంటే..
🎞️ హీరో విజయ్ (Vijay)కు ఇది 66వ చిత్రం కాగా.. హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna)కు 15వది. అలాగే, దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally)కి ఇది ఆరో చిత్రం.
🎞️ ‘ఊపిరి’ రీమేక్‌తో వంశీ పైడిపల్లి కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన నేరుగా తమిళంలో తెరకెక్కించిన చిత్రంగా ‘వారిసు’ (Varisu) నిలవనుంది.
🎞️ కథ వినగానే నటించేందుకు వెంటనే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. టాలీవుడ్ హీరోలు మహేశ్‌బాబు, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్.. వీరిలో ఎవరితో ఒకరితో చేయాల్సిన సినిమా ఇది అని, అనుకున్న సమయానికి వారు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో విజయ్ను సంప్రదించామని నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఓ సందర్భంలో చెప్పారు.
🎞️ ఎన్నో ఏళ్ల తర్వాత విజయ్ (Thalapthy Vijay) నటించిన ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. ప్రేక్షకులు కోరుకునే ఫన్, ఎమోషన్, ఫైట్లు, అదిరిపోయే పాటలు, డ్యాన్స్.. ఈ సినిమాలో ఉన్నాయని, తల్లిదండ్రులందరికీ ఈ చిత్రం (Varasudu) అంకితమని దిల్ రాజు ఆడియో విడుదల వేడుకలో వెల్లడించారు.
🎞️ టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ నటించిన తొలి తమిళ చిత్రమిదే. ఆయనతోపాటు కిక్ శ్యామ్, శరత్‌కుమార్, జయసుధ, ప్రభు, ప్రకాశ్‌రాజ్, యోగిబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు.
🎞️ విజయ్ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ ట్యూన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలోని ‘రంజితమే’ (Ranjithame) లిరికల్ వీడియో యూట్యూబ్‌లో 128 మిలియన్ (12 కోట్ల 80 లక్షలు) వ్యూస్ సాధించి, రికార్డు సృష్టించింది.
🎞️ ఈ సినిమా తమిళ ట్రైలర్ 39 మిలియన్లకుపైగా (3 కోట్ల 90 లక్షలకుపైగా) వీక్షణలు సొంతం చేసుకోగా.. తెలుగు ట్రైలర్ 5.9 మిలియన్ (59 లక్షలు) వ్యూస్ దక్కించుకుంది (జనవరి 4 నుంచి జనవరి 8 వరకు).
🎞️ చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, బళ్లారి, లద్దాఖ్ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరించారు.
🎞️ సెన్సార్ బోర్డు ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చిన ఈ సినిమా రన్ టైమ్ 170 నిమిషాలు (సుమారు 3 గంటలు).
🎞️ సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రాన్ని 2023 జనవరి 12న విడుదల చేయాలనుకుంది చిత్ర బృందం. ఆ తేదీని మార్పు చేసి జనవరి 11నే రిలీజ్ చేస్తున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. తాజాగా తమిళంలో జనవరి 11న తెలుగులో జనవరి 14 విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘వీళ్ల నాన్న ఎంత మంచి నటుడో.. ఇతనంత వేస్ట్‌ఫెలో’ అన్నారు: సూర్య జర్నీ ఇదే..!
ప్రముఖ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.. -
హీరోయిన్ల జోరు.. జాన్వీ, భాగ్యశ్రీ అలా.. మీనాక్షి, ప్రియాంక ఇలా!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లపై ప్రత్యేక కథనం. -
‘ఆలస్యమైందా ఆచార్య పుత్రా’.. ఇవి కదా ప్రభాస్ కటౌట్‌కు అదిరిపోయే సీన్స్
సినిమా మొత్తం ఒక ఎత్తయితే, ప్రభాస్ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇచ్చి, థియేటర్ దద్దరిల్లిపోయేలా చేశారు కొందరు దర్శకులు.. ఆ సినిమాలు ఏంటి? ఆ సీన్స్ ఏంటి? -
‘హనుమాన్’తో మొదలై.. ‘కల్కి’తో ముగిసి: టాలీవుడ్ ఫస్టాఫ్ రిపోర్టు
2024లో విడుదలైన (జనవరి నుంచి జూన్ వరకు) తెలుగు సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ సినిమా హిట్, ఏది ఫట్ అంటే? -
అప్పుడు భయపడి.. ఇప్పుడు సినీ ప్రపంచాన్నే తనవైపు తిప్పుకొని!
‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కాబోతున్న సందర్భంగా హీరో ప్రభాస్ కెరీర్‌పై ప్రత్యేక కథనం.. -
రూ. 4 వేల జీతం నుంచి రూ. 600 కోట్ల ‘కల్కి’ వరకు.. నాగ్ అశ్విన్ జర్నీ ఇదీ
‘సాధారణంగా కనిపించే చాలామంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ ఉంటుంది’.. దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ఉద్దేశిస్తూ నటుడు కమల్ హాసన్ చెప్పిన మాటలివి. -
ఎన్టీఆర్ పెట్టిన పేరు.. భారీ చిత్రాలకు మారుపేరు ‘వైజయంతీ మూవీస్’
Vyjayanthi Movies: భారీ అంచనాల మధ్య ప్రభాస్, నాగ్ అశ్విన్‌ల ‘కల్కి 2898 ఏడీ’ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను నిర్మించిన ‘వైజయంతీ మూవీస్’ గురించి ఆసక్తికర విషయాలు.. -
ఆ తెలుగు చిత్రంలో నటించారు కానీ: దీపికా పదుకొణె గురించి మీకివి తెలుసా?
దీపికా పదుకొణె ఓ ప్రధాన పాత్ర పోషించిన ‘కల్కి 2898 ఏడీ’ గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి ప్రత్యేక కథనం.. -
‘కల్కి’లో ప్రభాస్, కమల్‌హాసన్ పాత్రలకు పురాణాల రిఫరెన్స్ అదేనా?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో పాత్రలు, వాటిని ఎక్కడినుంచి తీసుకున్నారో తెలుసా? -
‘కల్కి’ ఎవరు? ఆ అవతారం ఎప్పుడు వస్తుంది?సినిమాలో ఏం చూపించబోతున్నారు?
నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో అసలు ‘కల్కి’ అవతారం.. దాని విశేషాలు తెలుసుకుందాం. -
‘కల్కి 2898 ఏడీ’లో మలయాళ నటి.. ఎవరీ అన్నా బెన్?
‘కల్కి 2898 ఏడీ’లో కీలక పాత్ర పోషించిన అన్నా బెన్ గురించి పలు ఆసక్తికర విషయాలు.. -
కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు నేడు తుదిశ్వాస విడిచారు. జర్నలిజం రంగంలోనే కాకుండా సినీ రంగంలోనూ ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన నిర్మించిన ఉషా కిరణ్ మూవీస్ ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. -
భారీ టైర్లు.. ఆరు టన్నుల బరువు.. ‘కల్కి’లో ‘బుజ్జి’ కారు విశేషాలు తెలుసా?
kalki 2898 ad: కల్కిలో బుజ్జిగా కీలక పాత్ర పోషిస్తున్న కారు గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
వేర్వేరు సంవత్సరాల్లో మే 9న విడుదలై మంచి విజయాలు అందుకున్న సినిమాలపై ప్రత్యేక కథనం. అవేంటో చూసేయండి.. -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా గురించి ప్రత్యేక కథనం. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేను సినిమాలు చేస్తూనే ఉంటా.. మీ పని మీరు చేయండి: విశాల్ పోస్ట్
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్‌తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ