Vijay Deverakonda: నా వైవాహిక జీవితం ఇలానే ఉండాలని కోరుకుంటున్నా: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమాలోని ప్రేమ గీతాన్ని తాజాగా విడుదల చేశారు. దీనిపై విజయ్‌ దేవరకొండ కామెంట్స్‌ వైరలవుతున్నాయి.

Updated : 13 Jul 2023 13:30 IST

హైదరాబాద్‌: సినిమాల గురించి, పర్సనల్‌ లైఫ్‌ గురించి.. ఇలా విజయ్‌ ఏది మాట్లాడినా వైరల్‌ అయిపోతూ ఉంటుంది. తాజాగా తన కొత్త సినిమా ‘ఖుషి’ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దానికి కారణం ఆయన ఆ వ్యాఖ్యలను తన వ్యక్తిగత జీవితాన్ని లింక్‌ చేసి మాట్లాడటమే. ‘ఖుషి’ నుంచి ఇటీవల విడుదలైన ప్రేమ గీతం ‘ఆరాధ్య..’  ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాట విడుదలకు ముందు విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను వివాహం చేసుకున్నాక ఈ పాటలో చూపించిన విధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

‘‘ఖుషి’లో నాకు ఇష్టమైన పాటల్లో ‘ఆరాధ్య..’ ఒకటి. వివాహం చేసుకున్న తర్వాత సంవత్సరం పాటు జంట ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు. ఎంతో అద్భుతంగా సాగే ఈ పాటలో భార్యభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని అందంగా చిత్రీకరించారు. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ, భవిష్యత్తులో నా వైవాహిక జీవితం ఈ పాటలో ఉన్నట్లే ఉండాలని కోరుకుంటున్నా’’ అని విజయ్‌ దేవరకొండ చెప్పారు. ఇక సినిమా విషయానికొస్తే...  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ - సమంత జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తొలుత వచ్చిన ‘నా రోజా నువ్వే..’ పాట కూడా సూపర్‌ హిట్‌ అయ్యి ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గత కొన్ని రోజులుగా విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన (Rashmika Mandanna) ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇటీవల డిన్నర్‌ డేట్స్‌, హాలీడే వెకేషన్స్‌కు వెళ్లి రావడం ఆ ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది. అయితే తమ మధ్య అలాంటిది ఏమీ లేదని, కేవలం స్నేహం మాత్రమే ఉందని ఇప్పటికే ఈ జంట ఎన్నోసార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి విజయ్‌ తన పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో వాళ్ల ప్రేమ టాపిక్‌ మళ్లీ చర్చలోకి వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని