మనకు ఉన్నది ఒక్కటే జీవితం: జాక్వలైన్‌

మనకు ఉన్నది ఒక్కటే జీవితమని.. తోటి వారికి సాయం చేసి ఆ జీవితాన్ని గౌరవిద్దామని శ్రీలంకన్‌ భామ, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ పేర్కొంది. ఆమె ఇటీవల You Only Live Once(YOLO) పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పింది. కరోనా సమయంలో అందరిలో ధైర్యం నింపేందుకు ఆ సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది.

Published : 07 May 2021 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనకు ఉన్నది ఒక్కటే జీవితమని.. తోటి వారికి సాయం చేసి ఆ జీవితాన్ని గౌరవిద్దామని శ్రీలంక భామ, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ పేర్కొంది. ఆమె ఇటీవల You Only Live Once(YOLO) పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పింది. కరోనా సమయంలో అందరిలో ధైర్యం నింపేందుకు ఆ సంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. కాగా.. ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ శివనందన్‌ ఆధ్వర్యంలో పేదలకు భోజనం అందిస్తున్న ‘రోటీ బ్యాంక్‌’ను ఆమె గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా పేదలకు స్వయంగా భోజనాలు వడ్డించింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ఇలా రాసుకొచ్చింది. 

‘‘ఆకలి కడుపు నిండినప్పుడే అసలైన శాంతి నెలకొంటుందని మదర్‌ థెరిసా అన్నారు. ఈ రోజు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇలా నా వంతు సాయం చేయడం ఎంతో గర్వంగా ఉంది. ముంబయి పోలీసులు నడిపిస్తున్న ఈ ‘రోటీ బ్యాంక్‌’ను చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. కరోనా సమయంలో ఎంతోమంది అన్నార్థులకు ఇది కడుపు నింపుతోంది. మనకు ఉన్నది ఒక్కటే జీవితం.. దాన్ని గౌరవిద్దాం. ఆపదలో ఉన్న తోటివారికి సాయం చేద్దాం’’ అని ఆమె పేర్కొంది. 

జాక్వలైన్‌ చేతిలో చాలా సినిమాలున్నాయి. ‘అటాక్‌’, ‘భూత్‌ పోలీస్‌’, ‘సర్కస్‌’, ‘బచ్చన్‌ పాండే’, ‘రామ్‌ సేతు’ చిత్రాల్లో ఆమె నటిస్తోంది. సల్మాన్‌ఖాన్‌ ‘రాధే’లో ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని