రఘునందన్‌ బంధువుల ఇళ్లలో సోదాలు

దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల

Published : 27 Oct 2020 01:09 IST

సిద్దిపేట టౌన్‌: దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు అధికారులు భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం ఉద్రిక్తతకు దారితీసింది. రఘునందన్‌ రావు మామ రాంగోపాల్‌రావు, మరో బంధువు అంజన్‌ రావు ఇళ్లలో అధికారులు సోమవారం సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో అంజన్‌ రావు ఇంట్లో అధికారులకు రూ.18.67లక్షలు లభించాయి. 

ఈ సోదాలపై సమాచారం అందుకున్న భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు, భాజపా శ్రేణులు అంజన్‌రావు ఇంటికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రఘునందన్‌ సొమ్మసిల్లి కిందపడిపోయారు. అధికారులు స్వాధీనం చేసుకున్న నగదులో కొంత మొత్తాన్ని భాజపా శ్రేణులు లాక్కెళ్లాయి. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు తెరాసకు చెందిన సిద్దిపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజనర్సు ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని