‘ప్రధానికి లేఖరాస్తే డీజీపీ స్పందించడం విచిత్రం’

ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలు ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 19 Aug 2020 01:46 IST

ఫోన్‌ ట్యాపింగ్‌ ముందు నుంచీ వైకాపాకు అలవాటే: చంద్రబాబు

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలు ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై తాను ప్రధాని మోదీకి లేఖ రాస్తే.. డీజీపీ స్పందించడం విచిత్రంగా ఉందని చెప్పారు. ప్రతిపక్ష నేతలపై దాడులు, తప్పుడు కేసులపై గతంలోనూ డీజీపీకి లేఖలు రాశానని.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ, ఆత్మకూరు పర్యటనలకు తాను వెళ్లకుండా ఆపడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వైకాపాకు ముందునుంచీ ఉన్న అలవాటేనని.. గతంలో సీబీఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ ఫోన్లు ట్యాప్‌ చేసిన చరిత్ర వీళ్లదని ఆరోపించారు. చివరికి ఇప్పుడు వైద్యుల ఫోన్లను కూడా ట్యాప్‌ చేసే దుస్థితికి వచ్చారన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని