ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. ప్రకటించిన విశ్రాంత ఐఏఎస్‌

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. ‘లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని ఏర్పాటు చేసినట్టు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయ్‌ కుమార్‌ ప్రకటించారు. 

Published : 14 Feb 2024 22:13 IST

గుంటూరు: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ తెరపైకి వచ్చింది. ‘లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని ఏర్పాటు చేసినట్టు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి విజయ్‌ కుమార్‌ ప్రకటించారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అధికజన మహాసంకల్ప సభలో ఆయన పార్టీ పేరును వెల్లడించారు.

‘‘జగన్‌.. పేదల కోసం యుద్ధం చేస్తా అంటున్నారు. పెత్తందార్లు దోచుకున్న భూములను పేదలకిచ్చి నిజాయితీ చాటుకోండి. దౌర్జన్యంగా లాక్కున్న వారికి ఆస్తులు చెందేలా చట్టాన్ని మార్చారు. సర్వే చేయించి అసలైన లబ్ధిదారులకు భూములు ఇవ్వాలి. అసుపత్రులకు వెళ్లలేక గిరిజన మహిళలు చనిపోతున్నారు’’ అని విజయ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని