ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు!
ఏపీలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన....
అమరావతి: ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపైనే కీలకంగా చర్చించారు. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూను ఎలా అమలు చేయాలి? విధివిధానాలేంటి? అనే అంశంపై మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూ నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో మధ్యాహ్నం 12గంటల తర్వాత ఎక్కడా జనసంచారం లేకుండా ఉండేందుకు పోలీసులు, ఇతర యంత్రాంగం సమన్వయంతో పనిచేసి కర్ఫ్యూని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. సరిపడా పడకలు లేక కొందరు చనిపోతున్నట్టు బాధితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ కొరతను ఎలా అధిగమించాలనే అంశంపైనా చర్చించారు. సుమారు 50 వేల బెడ్ల వరకు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో పలు చోట్ల ఆక్సిజన్ సమస్యపై చర్చ జరగ్గా.. తగిన ఆక్సిజన్ ఉన్నప్పటికీ రవాణాకు ట్రక్కుల కొరత వేధిస్తోందని, అందుకే సకాలంలో ఆస్పత్రులకు ఆక్సిజన్ అందడంలో జాప్యం జరుగుతున్నట్టు మంత్రులు సీఎంకు తెలిపినట్టు సమాచారం. దీంతో విదేశాల నుంచి కూడా ట్రక్కులు కొనుగోలు చేయాలనే అంశంపైనా చర్చించినట్టు తెలుస్తోంది.
మరోవైపు వ్యాక్సినేషన్ అంశంపైనా కీలకంగా చర్చించారు. రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల వారికి టీకా వేసేందుకు వీలుగా నిధుల కేటాయింపుపైనా మంత్రులు చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. రాష్ట్రంలో టీకా కొరత ఉండటంతో భారీగా కొనుగోలు చేసేందుకు తగిన ఏర్పాట్లపైనా చర్చించారు. వీటితో పాటు రెమిడెసివర్ ఇంజెక్షన్ల కొనుగోళ్లపైనా చర్చ జరిగింది. టూరిజం శాఖకు సంబంధించి పలు అంశాలపైనా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ సాయంత్రం 4గంటలకు మంత్రి పేర్నినాని కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు. కర్ఫ్యూ ఎలా అమలు చేయబోతున్నారు? విధివిధానాలు ఏమిటి అనే అంశాలను ఆయన ప్రజలకు వివరించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్‌లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్‌సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.