CM Jagan: గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.... దిల్లీ టూర్‌పై చర్చ?

ఇటీవలే దిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలిశారు. సతీమణి భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం.. తొలుత గవర్నర్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్‌తో సీఎం జగన్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు....

Updated : 28 Apr 2022 21:23 IST

అమరావతి: ఇటీవలే దిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలిశారు. సతీమణి భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చిన సీఎం.. తొలుత గవర్నర్‌ దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గవర్నర్‌తో సీఎం జగన్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.

ఇటీవలే దిల్లీలో పర్యటించిన గవర్నర్‌.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పరిపాలనపై ప్రధాని, కేంద్ర హోం మంత్రికి గవర్నర్‌ నివేదిక ఇచ్చారు. దిల్లీ పర్యటన అనంతరం ఇరువురూ సమవేశం కావడంతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో దిల్లీ పర్యటనలో రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని, హోం మంత్రి వెలిబుచ్చిన అభిప్రాయాలను సీఎంకు గవర్నర్‌ వివరించినట్టు తెలిసింది. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలపై లోతుగా చర్చించారని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. కొత్త జిల్లాల వ్యవస్థతో పాలన ప్రజలకు మరింత చేరువైందని సీఎం గవర్నర్‌కు వివరించారు. నూతన జిల్లాల్లో కార్యాలయాలు అన్నీ ఒకే ప్రాంగణంలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్‌కు సీఎం తెలిపినట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని