Botsa: తెలంగాణ మంత్రుల స్పందనపై రెండ్రోజులాగి మాట్లాడతా: మంత్రి బొత్స

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలు తెలుసుకుని వాటి భర్తీపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated : 14 Jul 2023 19:29 IST

అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీల వివరాలు తెలుసుకుని వాటి భర్తీపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం నిధులను దారి మళ్లిస్తుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఎవరి డబ్బులు.. ఎవరు దారి మళ్లిస్తున్నారని ఎదురు ప్రశ్నించారు. ప్రజల కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రజలకు వివిధ పథకాల ద్వారా నిధులు అందిస్తున్నామన్నారు.

తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పుకోవాలి కానీ, ఇలాంటి విమర్శలు చేయడం సరికాదన్నారు. వారి హయాంలో ప్రభుత్వ నిధులు దోచుకుతిన్నారని ఆరోపించారు. 165 రోజులు కాదు.. 660 రోజులైనా చంద్రబాబు సీఎం కాలేరన్నారు. తెలంగాణ విద్యావ్యవస్థపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ మంత్రుల స్పందనపై ప్రశ్నించగా.. ఆ విషయంపై రెండ్రోజుల తర్వాత మాట్లాడుతానని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని