అస్సాంలో మొదలైన రిసార్టు రాజకీయాలు!

గువాహటి: శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే అస్సాంలో రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. అభ్యర్థులను కాపాడుకొనేందుకు కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే తలమునకలవుతోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు భాజపా, కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని తాజా సర్వేలు వెల్లడించాయి.

Published : 09 Apr 2021 20:00 IST

అభ్యర్థులను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ యత్నాలు

గువహటి: శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే అస్సాంలో రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. అభ్యర్థులను కాపాడుకొనేందుకు కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే తలమునకలవుతోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు భాజపా, కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని తాజా సర్వేలు వెల్లడించాయి. దాంతో కూటమిలో అంతర్గత సంక్షోభం తలెత్తె ప్రమాదం ఉందని హస్తం పార్టీ ముందుగానే పసిగట్టినట్టుంది. దాంతో ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్‌)తో పాటు, లెఫ్ట్‌ పార్టీలకు చెందిన 22 మంది అభ్యర్థులను కాంగ్రెస్‌ పాలిత ప్రాంతం రాజస్థాన్‌కు తరలించింది. వీరిలో ఆ పార్టీలకు చెందిన అధినాయకులు కూడా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ వీరికి జైపూర్‌లోని స్థానిక హోటల్‌లో బస ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల్లో పలువురు కుటుంబాలతో, మరికొందరు ఒంటరిగా జైపూర్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అస్సాంలో మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 6 వరకు మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. మే 2న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని