Bhatti Vikramarka: కేసీఆర్‌.. సభకు రాకుండా నల్గొండకు వెళ్తారా?: భట్టి

కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టి, తీర్మానం చేసి దిల్లీకి పంపుదామంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ సభకు రాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు.

Updated : 12 Feb 2024 15:28 IST

హైదరాబాద్‌: కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చ చేపట్టి, తీర్మానం చేసి దిల్లీకి పంపుదామంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ సభకు రాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. అసెంబ్లీకి రాని వ్యక్తి.. మంగళవారం నల్గొండ సభకు వెళ్తారా? అని ప్రశ్నించారు. ఈఎన్‌సీ మురళీధర్‌రావును భారాస తమకు అనుకూలంగా మాట్లాడించిందని ఆరోపించారు. ఆయన రిటైరైనా పదేళ్లు భారాస సర్కారు కొనసాగించిందన్నారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంలో భారాస ఏజెంట్లు చాలా మంది ఉన్నారని, వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని