TS News: ఈటల చేరికకు భాజపా గ్రీన్‌ సిగ్నల్‌

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరికకు భాజపా అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక అంశంపై జాతీయ, రాష్ట్ర నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరికకు భాజపా అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక అంశంపై జాతీయ, రాష్ట్ర నేతలతో ఆ పార్టీ జాతీయ

Published : 28 May 2021 01:42 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేరికకు భాజపా అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈటల చేరిక అంశంపై జాతీయ, రాష్ట్ర నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. వర్చువల్‌గా జరిగిన సమావేశంలో నడ్డాతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు మాట్లాడారు. ఈ క్రమంలో ఈటల చేరికకు భాజపా అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పార్టీలో ఆయన చేరిక తేదీని రెండు రోజుల్లో భాజపా ఖరారు చేయనుంది. అధిష్ఠానం ప్రకటించిన తర్వాత దిల్లీ వెళ్లనున్న ఈటల.. భాజపా ముఖ్యనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా భాజపాలో చేరే అవకాశముంది. 

కొద్దిరోజులుగా భాజపా కీలక నేతలతో మంతనాలు జరిపిన ఈటల.. బుధవారం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో మరోసారి ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. దిల్లీ పర్యటన తర్వాత ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని