Raghunandan: పోలీసుల యాక్షన్‌ బట్టే నా రియాక్షన్‌: రఘునందన్‌

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై నిర్వహించిన మీడియా సమావేశంలో బాలిక పేరు, ఫొటో, ఊరు పేర్లను తాను చెప్పలేదన్నారు.

Updated : 07 Jun 2022 14:46 IST

హైదరాబాద్‌: కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనపై నిర్వహించిన మీడియా సమావేశంలో బాలిక పేరు, ఫొటో, ఊరు పేర్లను తాను చెప్పలేదన్నారు. ప్రెస్‌మీట్‌లో వీడియోను ప్రదర్శించారంటూ అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో రఘునందన్‌పై కేసు నమోదైన నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీతో ఆయన మాట్లాడారు. 

తానూ న్యాయవాదినేనని.. తనకూ చట్టం తెలుసని రఘునందన్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కావాలనే తనపై బురద చల్లుతోందని విమర్శించారు. తానెప్పుడూ బాధితురాలి తరఫునే మాట్లాడతానని.. ఎంఐఎంపై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్‌కు ఎందుకు బాధ అని ఆయన ప్రశ్నించారు. సహజ మిత్రులను కాపాడేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని.. దాని పరిధిలో మాత్రమే మాట్లాడానని చెప్పారు. నిజంగా పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో తీసిన వాళ్లపై కేసు పెట్టాలన్నారు. తనపై కేసు విషయంలో పోలీసుల యాక్షన్‌ బట్టే తన రియాక్షన్‌ ఉంటుందని రఘునందన్‌ వ్యాఖ్యానించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని