BJP: జగన్‌ నొక్కే బటన్‌కు బ్యాటరీ ఇచ్చేది మోదీనే: జీవీఎల్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నొక్కే బటన్‌కు బ్యాటరీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్రం అందిస్తున్న

Published : 11 Jul 2022 18:44 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నొక్కే బటన్‌కు బ్యాటరీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటూ ఈ నెల 14న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామని జీవీఎల్‌ ప్రకటించారు. జగన్‌ను వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని విమర్శించారు. ‘‘ బటన్‌ నొక్కి నేరుగా నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని పదే పదే చెబుతున్నారు. కానీ, బటన్‌ నొక్కడానికి బ్యాటరీ మోదీ ఇస్తున్నారని జగన్‌ ఎందుకు చెప్పడం లేదు. కేంద్రం నుంచి ఆర్థిక సాయం చేయకపోతే బటన్‌ పనిచేసేది కాదు. నరేంద్రమోదీకి పేరు వస్తుందేమోనని ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం ఇవ్వడం ఆపేసింది. ధాన్యం సేకరించిన రైతులకు ఇంత వరకు బకాయిలు చెల్లించలేదు. కేంద్ర చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెల్లించటం లేదు?’’ అని జీవీఎల్‌ ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని