Chandrababu: అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు.

దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెదేపా అధినేత చంద్రబాబు మధ్య జరిగిన భేటీ ముగిసింది. శనివారం మధ్యాహ్నం దిల్లీ చేరుకున్న చంద్రబాబు.. రాత్రి 8 గంటల సమయంలో అమిత్ షా నివాసంలో జేపీ నడ్డా షాను కలిశారు. చంద్రబాబు దిల్లీ పర్యటన ప్రైవేటు కార్యక్రమమని పార్టీ వర్గాలు తెలిపాయి. సుమారు 40 నిమిషాలకు పైగా ఈ భేటీ సాగింది. తాజా రాజకీయాలతోపాటు ఇతర అంశాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.
2019 ఎన్నికల తర్వాత ఆజాది కా అమృత్ మహోత్సవ్ సమయంలో ఒకసారి ప్రధాని మోదీని చంద్రబాబు కలిశారు. జీ20 సన్నాహక సదస్సుకు హాజరయ్యేందుకు దిల్లీ వెళ్లినప్పుడు మరోసారి భేటీ అయ్యారు. టచ్‌లో ఉండాలంటూ ఆ సందర్భంగా చంద్రబాబుకు మోదీ సూచించిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు జేపీ నడ్డా, అమిత్ షాతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada: తొలిసారి.. కెనడా దిగువ సభ స్పీకర్‌గా ఆఫ్రో-కెనడియన్!
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!
-
Malavika Mohanan: నన్ను కాదు.. ఆ ప్రశ్న దర్శకుడిని అడగండి: మాళవికా మోహనన్
-
World Cup-Sachin: వన్డే ప్రపంచకప్.. సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం