Guntur: షర్మిల పీసీసీ చీఫ్‌ అయ్యాక జగన్‌లో భయం మొదలైంది: ఆళ్ల

కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల రాక కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. గురువారం గుంటూరులో జరిగిన ర్యాలీ, పార్టీ సమావేశానికి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

Published : 26 Jan 2024 21:50 IST

గుంటూరు: కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ షర్మిల రాక కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. గురువారం గుంటూరులో జరిగిన ర్యాలీ, పార్టీ సమావేశానికి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. గతంలో పీసీసీ అధ్యక్షులు వచ్చినా 100 మందికి మించి హాజరయ్యేవారు కాదు. ఇవాళ వేలాది మంది షర్మిల కార్యక్రమానికి తరలివచ్చారు. వారిలో ఎక్కువ మంది మైనార్టీలు, ఎస్సీలు ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మస్తాన్‌ వలి, లింగంశెట్టి ఈశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం వంటి నాయకులు పాల్గొన్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అయ్యాక జగన్‌లో భయం మొదలైందన్నారు. వైనాట్‌ 175 నుంచి ప్రజలు ఓడిస్తే ఇంట్లో కూర్చుంటామని సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మోసపూరిత వైకాపాను ఓడించి రాజశేఖర్‌రెడ్డి పాలన తెచ్చుకోవాలంటే కాంగ్రెస్‌కు ఓటేయాలని పిలుపునిచ్చారు. మాలమహానాడు అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్‌ షర్మిలను కలిసి వైకాపా పాలనలో దళితులపై జరుగుతున్న దాడులు, ఉప ప్రణాళిక నిధుల మళ్లింపు విషయంపై వినతిపత్రం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని