Rahul Gandhi: రెండు శాతం ఓట్లు వచ్చే భాజపా.. ఓబీసీని సీఎం చేస్తుందా?: రాహుల్‌

ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు కలలుగన్నారని.. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక కుటుంబానికే మేలు జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. 

Published : 01 Nov 2023 16:21 IST

కల్వకుర్తి: ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు కలలుగన్నారని.. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక కుటుంబానికే మేలు జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఉద్యోగాలు, పదవులు అన్నీ ఒకే కుటుంబానికి దక్కాయన్నారు. ప్రస్తుతం దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య పోటీ నడుస్తోందన్నారు. కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. భారాస, భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ కుటుంబం రూ.లక్ష కోట్లు దోచుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో భారీ ప్రాజెక్టులను నిర్మించింది. ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన ప్రజలకు ఇళ్లు, భూములు ఇచ్చాం. ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి పేదల భూములను లాక్కున్నారు. ఈ పోర్టల్‌ ద్వారా 20 లక్షల మంది రైతుల భూములు లాక్కున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములనూ లాక్కున్నారు. ఓబీసీని ముఖ్యమంత్రిని చేస్తానని భాజపా చెబుతోంది. రెండు శాతం ఓట్లు వచ్చే భాజపా ఓబీసీని సీఎం ఎలా చేస్తుంది? భాజపా మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం మహిళలు ఎంతో కష్టపడుతున్నారు. రాష్ట్రం కోసం, కుటుంబం కోసం కష్టపడే మహిళలకు న్యాయం జరగాలి. అందుకే మహిళలకు ప్రతినెలా రూ.2500 ఖాతాల్లో వేస్తాం. కేంద్రంలోని భాజపా సర్కార్‌ గ్యాస్‌ సిలిండర్‌ను రూ.వెయ్యికి పెంచింది. కాంగ్రెస్‌ గెలిస్తే.. రాష్ట్రంలో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వస్తుంది’’ అని రాహుల్‌ గాంధీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని