Etela Rajender: గవర్నర్‌తో అనేక అబద్ధాలు చదివించారు: ఈటల
గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తెలంగాణ సర్కార్ గొప్పలు చెప్పుకొనే విధంగా ప్రసంగం ఉందని ఆయన విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొనే విధంగా గవర్నర్ తమిళిసై బడ్జెట్ ప్రసంగం ఉందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యం పెరిగిందని ప్రభుత్వం చెబుతోందని.. మరి అలాంటప్పుడు రైతులకు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
‘‘విద్యుత్ లేక ఇవ్వట్లేదా? లేక ఇంకేమైనా? అనేది రైతులకు చెప్పాలి. రైతుబంధు సొమ్ము రాక రైతులు భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొంది. ‘ధరణి’లో పేదలకు జరిగిన అన్యాయం ఊసే లేదు. కేంద్ర నిధులతో పట్టణాల్లో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించారు. సిద్దిపేట, గజ్వేల్ తప్ప పేదలకు ఎక్కడా రెండు పడక గదుల ఇళ్లు కట్టే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ధరణి విధానం, డబుల్ బెడ్ రూం ఇళ్లు రాక ఎంతో మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. గవర్నర్‌తో అనేక అబద్ధాలను ప్రసంగంలో చవివించారు’’ అని ఈటల మండిపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
Congress: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్లకు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!
-
Politics News
BJP: జేపీ నడ్డా తెలంగాణ పర్యటనలో మార్పులు..
-
Sports News
IPL 2023: ‘కేఎల్ రాహుల్, డికాక్ ఆరెంజ్ క్యాప్ పోటీదారులుగా ఉంటారు’
-
India News
IN PICS: పార్లమెంట్ నూతన భవనాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ప్రధాని మోదీ