Vikarabad: భాజపాకు మాజీ మంత్రి చంద్రశేఖర్‌ రాజీనామా

భాజపాకు మాజీ మంత్రి చంద్రశేఖర్‌ రాజీనామా చేశారు. పార్టీలో పనిచేసేవారిని ప్రోత్సహించడం లేదని ఆయన ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. 

Updated : 13 Aug 2023 08:29 IST

వికారాబాద్‌: భాజపాకు మాజీ మంత్రి చంద్రశేఖర్‌ రాజీనామా చేశారు. పార్టీలో పనిచేసేవారిని ప్రోత్సహించడం లేదని ఆయన ఆరోపించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. 

భాజపాకు చంద్రశేఖర్‌ గతకొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించినా ఫలితం లేకపోయింది. చంద్రశేఖర్‌ 1985 నుంచి 2008 వరకు వరుసగా 5 సార్లు వికారాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.  ఆ తర్వాత భాజపాలో చేరిన చంద్రశేఖర్‌.. నేడు పార్టీని వీడారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరతారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని