తెరాస, భాజపాల మధ్యే అసలు పోటీ

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు ఎవరూ పోటీలేరని చెప్పిన తెరాస భాజపాను లక్ష్యంగా చేసుకొని అక్రమాలకు పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని లక్ష్మణ్‌... 

Published : 22 Jan 2020 22:50 IST

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు ఎవరూ పోటీలేరని చెప్పిన తెరాస భాజపాను లక్ష్యంగా చేసుకొని అక్రమాలకు పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని లక్ష్మణ్‌ విమర్శించారు. స్థానికంగా సెలవులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారని అన్నారు. పుర పోరులో తెరాస, భాజపాల మధ్యే అసలు పోటీ నెలకొందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. డబీర్‌పురాలో ఓటు వేయడానికి ముస్లింలు ముందుకు రాలేందటే ఎంఐఎంపై ఎంత విరక్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా సీట్లు, ఓట్ల సంఖ్య పెంచుకుంటామని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని