దిల్లీలో కాంగ్రెస్‌కు రిక్త హస్తం

దిల్లీ: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేసినట్లుగానే దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేదు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడగానే ఖండించిన దిల్లీ కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పుడు అవే ఫలితాలను చూస్తూ మౌనాన్ని ప్రదర్శిస్తోంది. కౌంటింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే వికాస్‌పూరి కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేశ్‌ శర్మ తన ఓటమిని అంగీకరించాడు.

Published : 11 Feb 2020 11:39 IST

దేశ రాజధానిలో మరింత దిగజారిన కాంగ్రెస్‌ 

దిల్లీ: ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేసినట్లుగానే దిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేదు. తొలుత ఎగ్జిట్‌పోల్స్‌పై విరుచుకుపడిన ఆ పార్టీ ఇప్పుడు ఫలితాలను చూసి మౌనంగా ఉండిపోయింది. కౌంటింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే వికాస్‌పూరి కాంగ్రెస్‌ అభ్యర్థి ముఖేశ్‌ శర్మ తన ఓటమిని అంగీకరించడం విశేషం. 2015 ఎన్నికల ఫలితాలే ఇప్పుడు కూడా పునరావృతమవుతున్నాయని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 

అయితే గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో భాజాపా పుంజుకోగా కాంగ్రెస్‌ మాత్రం అదే స్థితిలో కొనసాగుతోంది. 15 సంవత్సరాలు ఏకధాటిగా రాష్ట్రాన్ని పాలించిన షీలాదీక్షిత్‌ వంటి నాయకులు ఇప్పుడు స్థానికంగా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ మూడో స్థానానికే పరిమితం అయ్యింది. 2013లో దాదాపు 24శాతం ఓటు షేర్‌ ఉన్న కాంగ్రెస్‌ 2015 వచ్చేసరికి దాదాపు 10శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఫలితాలను విశ్లేషిస్తే మాత్రం ఈ సారి మరింత దిగజారే పరిస్థితి కనిపిస్తోంది. 

ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చిన వెంటనే స్పందించిన కాంగ్రెస్‌.. ఈసారి కూడా ఆమ్‌ఆద్మీ పార్టీదే విజయమని అంచనా వేస్తున్నట్లు అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. తాము కావాలనే ఎన్నికల్లో భారీగా ప్రచారం చేయలేదని..ఒకవేళ అలా చేస్తే ఓట్లు చీలిపోయి పరిస్థితి బీజేపీ అనుకూలంగా మారే అవకాశం ఉందని తెలపడం గమనార్హం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని