చిల్లర రాజకీయాలు మానుకోవాలి: మోపిదేవి

రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, నెల్లూరు తప్ప ఇతర జిల్లాల్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో

Published : 20 Apr 2020 00:28 IST

గుంటూరు: రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, నెల్లూరు తప్ప ఇతర జిల్లాల్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో గుంటూరుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో 500 పడకల కొవిడ్‌ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొవిడ్‌ వ్యాప్తి, నివారణ ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 

లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున మే 3 వరకు ఇళ్లలోనే ఉండాలని ఆయన కోరారు. రాజధాని తరలింపు, స్థానిక ఎన్నికల నిర్వహణపై సందర్భం వచ్చినపుడు మాట్లాడతామని మోపిదేవి వ్యాఖ్యానించారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వ కృషిని స్వయంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారని మంత్రి గుర్తు చేశారు. సున్నితమైన సమయంలో విపక్ష నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని.. నిర్మాణాత్మకమైన సలహాలు ఇస్తే స్వాగతిస్తామని చెప్పారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని